Railway Recruitment
-
లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని షాక్
బీహార్ మాజీ సీఎం, ఆర్జేజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి ఊహించని షాక్ తగిలింది. లాలూ ప్రసాద్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నసమయంలో(2004-2009) మధ్య జరిగిన రైల్వే శాఖకు చెందిన పోస్టుల నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ తాజాగా అభియోగాలు మోపింది. దీంతో, రంగంలోకి దిగిన సీబీఐ శుక్రవారం.. ఒకేసారి లాలూ ప్రసాద్ ఇంటితో పాటుగా రాష్ట్రీయ జనతాదళ్‌కు సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోంది. ఇక, ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు కూడా పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తూ.. వారిని నిందితులుగా పేర్కొంది. ఇక, ఈ పోస్టులకు సంబంధించిన కేసులో రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ, అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. రూ. 139 కోట్లు డోరాండా ట్రెజరీ కుంభకోణం కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇటీవలే లాలూకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతోపాటుగా 60 లక్షల జరిమానా కూడా విధించింది. రైల్వే జాబ్స్ నియామకాల కేసుపై ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ మాట్లాడుతూ.. ప్రజల్లో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లకు పెరుగుతున్న పాపులారీ కారణంగానే ప్రభుత్వం కక్షగట్టి వారిపై ఇలా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు -
వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 3591 ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్ తదితరాలు. ► అర్హత: మెట్రిక్యులేషన్/పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి. ► వయసు: 04.06.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులేదు. ఇతరులు రూ.100 చెల్లించాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021 ► వెబ్సైట్: https://rrc-wr.com/ మరిన్ని నోటిఫికేషన్లు: ఏపీలో గ్రామ/వార్డ్ సచివాలయ వలంటీర్ ఉద్యోగాలు సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీలో ఉద్యోగాలు బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు -
రైల్వే ఉద్యోగాలా? ఇది మరో జుమ్లా - చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న రెండేళ్లలో నాలుగు లక్షల రైల్వే ఉద్యోగాలు కల్పిస్తామన్న రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రకటనపై మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. ఇదొక నెరవేరని హామీగా ఆయన అభివర్ణించారు. ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైన రైల్వే శాఖ హఠాత్తుగా నిద్రలేచిందంటూ విమర్శించారు. గత ఐదేళ్లుగా రైల్వేలో దాదాపు 2,82,976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇపుడు అకస్మాత్తుగా ఈ మూడు నెలల్లోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పుడు మోదీ సర్కారు ప్రకటస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఇది మరో జుమ్లా అని ట్వీట్ చేశారు. అనే ప్రభుత్వ విభాగాల్లో ఇదే ధోరణి ఉంది. ఒక వైపు ఖాళీగా ఉన్న పోస్టులు, మరొకవైపు నిరుద్యోగ యువత అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా 2020 నాటికి రైల్వేలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రానున్న రెండేళ్లలో ప్రస్తుతం ఖాళీ ఉన్న పోస్టుల భర్తీ చేస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Railways leave 2,82,976 posts vacant for nearly 5 years and suddenly wake up to say we will fill them in 3 months! Another jumla! The story is the same across many departments of the government. Vacant posts on one side, unemployed youth on the other. — P. Chidambaram (@PChidambaram_IN) January 24, 2019 -
రైల్వే నియామక ప్రక్రియ సమయం తగ్గింపు
న్యూఢిల్లీ: రైల్వే నియామక ప్రక్రియను రెండేళ్ల నుంచి 6 నెలలకు తగ్గించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేపట్టింది. గత నెల 24న వాస్కో–డి–గామా–పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన అనంతరం రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ల సమావేశం జరిగింది. ‘రైల్వే ఉద్యోగాల ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగం రావడానికి అభ్యర్థులకు కనీసం రెండేళ్లు పడుతుంది. దీంతో అనేకమంది వేరే ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం ద్వారా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ చాహాతే రామ్ ప్రతిపాదన చేశారు. దీంతో ఆరు నెలల్లోపు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు తమ అభిప్రాయాన్ని డిసెంబర్ 20లోగా తెలియజేయాలని లోహాని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కోరారు. -
ఉద్యోగాలే.. ఉద్యోగాలు
ఆర్ఆర్బీలో 18,252 పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ (ఆర్ఆర్బీ).. వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 18,252. దరఖాస్తుకు చివరి తేది జనవరి 25. వివరాలకు www.rrbsecunderabad.nic.in చూడొచ్చు. ఎన్‌ఐవోఎస్‌లో సూపర్వైజర్స, ప్రాక్టర్స నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్వైజర్, ప్రాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు22. ఇంటర్వ్యూ తేది జనవరి 6. వివరాలకు www.nios.ac.in చూడొచ్చు. సీ-మెట్లో వివిధ పోస్టులు పుణేలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 9. ఇంటర్వ్యూ తేదీలు జనవరి 11,12. వివరాలకు www.cmet.gov.inచూడొచ్చు. హెచ్ఈసీలో 15 పోస్టులు రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 30. వివరాలకు www.hecltd.comచూడొచ్చు. టెక్స్టైల్ కార్పొరేషన్లో 98 పోస్టులు న్యూఢిల్లీలోని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీసీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 98. దరఖాస్తుకు చివరి తేది జనవరి 10. వివరాలకు www.ntcltd.co.inచూడొచ్చు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కలో పోస్టులు ఢిల్లీలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో మెంబర్ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 26. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది జనవరి 3. వివరాలకు www.stpi.inచూడొచ్చు. ముంబై పోర్ట ట్రస్ట్‌లో వివిధ పోస్టులు ముంబై పోర్ట ట్రస్ట్.. రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్సీ/ఓబీసీ అభ్యర్థుల నుంచి పైలట్ (7), మెరైన్ ఇంజనీర్ (5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. చివరితేది డిసెంబర్ 31. వివరాలకు www.mumbaiport.gov.inచూడొచ్చు.