పుష్కరాలకు డబుల్ డెక్కర్ రైళ్లు
తిరుపతి అర్బన్: పుష్కరాల భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే అధికారులు డబుల్ డెక్కర్ రైళ్లను నడపనున్నట్లు తిరుపతి రైల్వే చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ ఎ.ఏలియా తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు డబుల్ డెక్కర్ రైళ్లు కర్నూలు, విజయవాడ మార్గాల్లో నడిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. పుష్కరాల కోసం ఇప్పటికే 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చెప్పారు. డబుల్ డెక్కర్ రైళ్లు నడిచే తేదీలు, మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి.
1) 07762 నెంబరు రైలు ఈనెల 18న ఉదయం 4:15 గంటలకు తిరుపతిలో బయలుదేరి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు నడుస్తుందన్నారు.
2) 07760 నెంబరు రైలు ఈనెల 22వ తేదీ రాత్రి 7:15 గంటలకు తిరుపతిలో బయల్దేరి కడప, కర్నూలు మీదుగా కాచీగూడ వరకు నడుస్తుందన్నారు. పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులకు మిగిలిన అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈనెల 18వ తేదీ తర్వాత బెర్తులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.