జీఎస్టీతోనే రైల్వే పనుల్లో జాప్యం
కేంద్ర రైల్వేమంత్రికి ఎంపీ కేవీపీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల రైల్వే పనులకు చెందిన కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌ను రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
ఇటీవలే పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన (బ్రిడ్జిల మరమ్మతులు, ట్రాక్‌ల నిర్వహణ) రూ.585 కోట్ల విలువైన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.