రెండ్రోజుల్లో కోస్తాంధ్రలో చిరుజల్లులు
హైదరాబాద్: మరో రెండు, మూడు రోజుల్లో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కదలనుందని తెలిపింది.
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి బంగాళాఖాతం, తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈనెల (మే) 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.