ఏపీలోకి నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో తెలంగాణకు రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాల రాకతో కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే 15 శాతం అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.