సింగరేణి అప్రమత్తం
గోదావరిఖని : గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. నదిని ఆనుకుని ఉన్న మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ఆదివారం బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. యంత్రాలను ఉపరితలానికి తరలించారు. డంపర్లు, ఇతర యంత్రాలను సురక్షిత ప్రాంతంలో నిలిపివేశారు. స్థానిక పవర్‌హౌస్‌కు సంబంధించి నీటిని తోడే యంత్రాలను ఉపరితలానికి తీసుకొచ్చారు. జీడీకె 1వ గని అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గంటగంటకూ ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వరద నీరు గోదావరిఖని ఫిల్టర్‌బెడ్ వద్ద 829 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.