raitu bharosayatra
-
జన కెరటం!
-
బ్రహ్మరథం
ముగిసిన మొదటి విడత రైతు భరోసా యాత్ర - హారతులు, బాణసంచాతో స్వాగతం - ఊరూరా బారులు తీరి ఆప్యాయత పంచిన ప్రజలు - వృద్ధులు, వికలాంగుల కష్టాలు పంచుకున్న జగన్ - పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట కలిపిన జననేత - గాజులపల్లె బహిరంగ సభకు పోటెత్తిన జనం ఆత్మకూరు: పంటలు పండక.. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మొదటి విడత రైతు భరోసా యాత్ర మంగళవారంతో ముగిసింది. శ్రీశైలం నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమయ్యారు. గ్రామ గ్రామాన అనూహ్య స్పందన లభించింది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆదరించిన తీరు.. వృద్ధులు, వికలాంగులు, రైతులు, కూలీలకు జీవితంపై భరోసా కల్పించగా.. అక్కాచెల్లెమ్మలను ఆశీర్వదిస్తూ.. యువతకు దిశేనిర్దేశం చేశారు. చివరి రోజు పల్లెల్లో పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ స్వాగతం పలకడం ఆయనకున్న జనాదరణకు అద్దం పట్టింది. మొత్తం పర్యటనలో మండుటెండలో.. రాత్రి పొద్దుపోయాక కూడా ప్రజలు బారులు తీరి స్వాగతించడం విశేషం. పంటల దుస్థితికి చలించిన ప్రతిపక్ష నేత శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆయా మండలాల్లో పంటల దుస్థితిని చూసి చలించిపోయారు. శ్రీనగరం సమీపంలో పసుపు పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెమ్మగిల్లిన కళ్లతో రైతులు మాట్లాడుతూ పంట సరిగా రాలేదని, తెగుళ్లతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీసం కౌలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఆ తర్వాత వరి, మిరప, పెసర పంటలను పరిశీలించి రైతుల స్థితిగతులపై ఆరా తీశారు. రైతుల బాధలు తెలుసుకున్న జగన్ వారిని ఓదారుస్తూ మన ప్రభుత్వంలో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు. 30 కిలోమీటర్లు.. 6 గంటల రోడ్‌షో మహానంది మండలంలో ఆరో రోజు చేపట్టిన భరోసాయాత్ర బుక్కాపురం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజలు బారులు తీరి స్వాగతం పలుకుతుండటంతో మూడు గ్రామాల రోడ్‌షో 6 గంటల పాటు సాగింది. నడిచేందుకు వీలు కాని వృద్ధులు కూడా అతి కష్టం మీద కర్రల సహాయంతో ఎదురొచ్చి పలుకరించారు. వికలాంగులు కూడా ఆయనను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. గాజులపల్లె గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ వద్ద జగన్ రోడ్‌షోను చూసి విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. విద్యార్థులు భారతి, నాగమణి, ఆయిషాలను బాగా చదువుకోవాలని జగన్ కోరడంతో మంచి మార్కులతో పాసవుతామంటూ బాలికలు చెప్పారు. ఈ సందర్భంగా జననేతతో కరచాలనానికి విద్యార్థులు పోటీపడ్డారు. గాజులపల్లెలో ఘన స్వాగతం.. మొదటి విడత భరోసా యాత్రలో భాగంగా చివరి రోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గాజులపల్లెలో యాత్ర ముగించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయనకు ఘనస్వాగతం పలికారు. బస్సాపురం, గుండంపాడు, మాదాపురం, ఆంజనేయస్వామి కొట్టాల, పచ్చర్ల గ్రామాల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత మాలలు వేస్తూ స్వాగతించారు. దారి పొడవునా యువత పెద్ద ఎత్తున బారులు తీరి ఈలలు, కేకలతో మద్దతు తెలిపారు. మల్లన్న, మహానందీశ్వర స్వాముల దర్శనం రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండవ రోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఐదవ రోజు ఓంకారేశ్వరుడి సేవలో తరించగా.. చివరి రోజు మహానందిలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మొత్తంగా నల్లమల అటవీ పరిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ న్చార్జి బుడ్డా శేషారెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నియోజకవర్గ ఇన్చార్జీలు రాజగోపాల్ రెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, ముంతల విజయభాస్కరరెడ్డి, మద్దయ్య, రాజా విష్ణవర్దన్రెడ్డి, కేవీ ప్రసాదరెడ్డి, రఘురెడ్డి, విశ్వనాథరెడ్డి, ద్వారం మాధవరెడ్డి, వెంకటేశ్వర యాదవ్, సత్యం యాదవ్, శరభారెడ్డి, లాయర్ వివేకానందరెడ్డి, మధుసూదన్, దేవ, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధలు వింటూ..భరోసానిస్తూ
-
చీకటి జీవితాల్లో చిరునవ్వులు
ప్రజలకు చేరువగా రైతు భరోసా యాత్ర - బారులు తీరిన జనంతో నెమ్మదిస్తున్న రోడ్‌షో - అడుగడుగునా ఆప్యాయత పంచుతున్న జగన్ - వృద్ధులు, వికలాంగులకు కొండంత ధైర్యం - రెండు మండలాల్లో ఐదవ రోజు యాత్ర - పట్టలేని ఆనందంలో రైతులు, కూలీలు రాజన్న బిడ్డ రాక అందరి కళ్లలో ఆనందం నింపింది. ఊరు ఊరునా.. అడుగడుగునా.. కుటుంబ సభ్యున్ని చూసిన భానవ కనిపించింది. అక్కా చెల్లెమ్మలను ఆశీర్వదిస్తూ.. అన్నా తమ్ముళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటూ.. ముసలవ్వల ఆవేదనను ఆలకిస్తూ.. వికలాంగులకు ధైర్యం చెబుతూ.. చీకటి నిండిన జీవితాల్లో చిరునవ్వుతో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. ఆత్మకూరు: పొలం గట్లపై పరుగు పరుగున వచ్చే రైతు కూలీలు.. దారి పొడవునా బారులు తీరిన ప్రజలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో సాగిన ఐదవ రోజు యాత్ర సోమవారం ఉదయం 9 గంటలకు లింగాపురం నుంచి మొదలయింది. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్‌షో బీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, ఓంకారం, ఈర్నపాడు, కడమకాల్వ, వెంగళరెడ్డినగర్, బి.కోడూరు, అబ్బీపురం మీదుగా తిమ్మాపురం వరకు సాగింది. రెండు మండలాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇక్కట్లను జనం ఏకరువు పెట్టారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. రైతులు, రైతు కూలీల కష్టాలు తెలుసుకున్నారు. పింఛన్లు అందలేదని.. పక్కా గృహాలు ఇవ్వడం లేదని.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అవస్థ. వీరందరితో జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం రావాలని భగవంతున్ని గట్టిగా కోరుకోవాలన్నారు. అందరి కళ్లల్లో ఆప్యాయత రాజన్న బిడ్డ రాకతో నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలు పరవశించాయి. పల్లె ప్రజల కళ్లల్లో ఆప్యాయత, అనురాగాలు వైఎస్ జగన్‌కు రెట్టించిన ఉత్సాహాన్నిచ్చాయి. నడవలేకపోయినా రోడ్డు మీదకొచ్చి నిల్చొన్న వృద్ధులను చూసి జగన్ వారి వద్దకు వెళ్లి పలకరించారు. యువత కేరింతలు కొడుతూ ఆయనతో కరచాలనం చేసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు పోటీపడటం విశేషం. రబీకి సాగునీరివ్వాలి రైతు భరోసా యాత్రలో భాగంగా రోడ్‌షో నిర్వహిస్తున్న జగన్‌కు రైతులు, కూలీలు తమ కష్టాలను వివరించారు. రబీకి సాగు నీరు అందించేలా చూడాలని వేడుకున్నారు. పంటకు నీరందకపోతే నష్టాలు కూరుకుపోతామని, ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుగంగ నుంచి రెండవ పంటకు సాగునీరు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మీ ఒక్కరితోనే సాధ్యమంటూ సోమయాజులపల్లె, బి.కోడూరు, తిమ్మాపురం రైతులు అభ్యర్థించారు. అందుకు జగన్ స్పందిస్తూ వచ్చేది రైతు రాజ్యమని, ప్రాజెక్టుల కింద మూడు పంటలు పండించుకోవచ్చని ధైర్యం చెప్పి ముందుకు కదిలారు. 30 కిలోమీటర్లు పైగా యాత్ర.. 12 గంటల రోడ్‌షో శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా యాత్ర 5వ రోజు 30 కిలోమీటర్లు పైగా 12 గంటల పాటు సాగింది. దారిపొడవునా ప్రజలు బారులు తీరి స్వాగతం పలకడంతో రోడ్‌షో నెమ్మదించింది. సింగవరం, లింగాపురం గ్రామాల మధ్య గొర్రెల కాపరులు ఎదురొచ్చి మాట్లాడించారు. వారితో జగన్ మాట్లాడుతూ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొర్రెలకు ఇన్సూరెన్స్ పథకం ఉండేదని, ప్రస్తుతం ఆ పథకం అమలవుతుందా అని ఆరా తీశారు. అందుకు వారు ఎలాంటి పథకం లేదని చెప్పారు. గొర్రెలు చనిపోతే ఎలాంటి నష్టపరిహారం అందడం లేదని, యేటా లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ మన ప్రభుత్వం వచ్చా అన్నివిధాల అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జీలు కాటసాని రామిరెడ్డి, చెరుకులపాడు నారాయణరెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, యుగంధర్‌రెడ్డి, బొంతల విజయభాస్కరరెడ్డి, రాజా విష్ణువర్దన్‌రెడ్డి, రాంపుల్లయ్య యాదవ్, మల్లెల రఘురెడ్డి, ప్రసాద్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయత పంచి.. ఆత్మస్థైర్యాన్ని నింపి..
-
అభిమాన తరంగం
పులకిస్తున్న ఊరూవాడా - నాలుగో రోజు 50 కిలోమీటర్లు సాగిన రైతు భరోసా యాత్ర - రైతుల బాధలు తెలుసుకుని ప్రభుత్వంపై నిప్పులు - లింగాపురంలో ఆకట్టుకున్న చిన్నారుల ప్రసంగం - తామంతా జగన్ వెంటేనంటూ ప్రతిన - మనవడిగా వృద్ధులకు ఆప్యాయతానురాగాలు - గ్రామ గ్రామాన వెంట నడిచిన యువత సాక్షి ప్రతినిధి, కర్నూలు: కుటుంబ సభ్యునిగా.. ఆత్మీయునిగా.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు భరోసానిచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో ఆదివారం అడుగడుగునా అభిమానం పోటెత్తింది. నాలుగో రోజు వేల్పనూరు నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన ఆయన చిన్నదేవళాపురం, నారాయణాపురం, సంతజూటూరు మీదుగా లింగాపురం, జీసీ పాలెం చేరుకుంది. ఈ రెండు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అక్కడి నుంచి సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠాపురం మీదుగా ఈర్నపాడు వరకు యాత్ర సాగింది. మొత్తం 11.30 గంటల పాటు సాగిన నాలుగో రోజు భరోసా యాత్ర దాదాపు 50 కిలోమీటర్లు కొనసాగింది. యాత్రంలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను జగన్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. గత మూడేళ్లుగా కరువుతో పంటలు లేవని.. ఇప్పుడు పండించిన కొద్దిపాటి పంటలకూ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు మండిపడ్డారు. రైతులను మోసం చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదనే భయాన్ని కలిగించాలని రైతులకు జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణాపురంలో మిరప రైతుతో మాట్లాడి సమస్య తెలుసుకున్న ఆయన.. లింగాపురం, సింగవరం, ఈర్నపాడుల్లో భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి చేసిన ఆవేశపూరిత ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పింఛన్లపై పోరాటం ప్రధానంగా రైతు భరోసా యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలో తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను ప్రేమగా పలుకరిస్తూ జగన్ ముందుకు కదులుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వితంతువులు తమకు పింఛను రావడం లేదని ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. అర్హత ఉన్నా తమకు పింఛను ఇవ్వడం లేదని తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గతంలో వచ్చే పాత పింఛన్లను కూడా తీసేశారని వివరించారు. ఈ నేపథ్యంలో పింఛన్ల కోసం కోర్టులో కేసు వేసి పోరాడదామని జగన్ వారికి ధీమా ఇచ్చారు. మరోవైపు రైతులు కూడా తమకు గిట్టుబాటు ధర లేదని విన్నవించారు. దేవుణ్ణి గట్టిగా కోరుకోవాలని.. ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. ఏడాది పాటు నిల్వ ఉంచుకోగలిగిన ఉల్లి, మిర్చి తదితర పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు కదా అన్న జగన్ మాటలు రైతులను ఆలోచింపజేశాయి. ఎన్నికల ముందు మద్దతు ధర కల్పించేందుకు రూ.5 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానన్న పెద్ద మనిషి కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కర్నూలు సోనా పేరు ఎత్తగానే రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేశంలోనే పేరుగాంచిన కర్నూలు సోనాకు ధర లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకట్టుకున్న పిల్లల మాటలు లింగాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత చివర్లో పిల్లలు సంగీత, అఖిలలు మాట్లాడారు. 2019లో ఫ్యాన్‌కు ఓటెయ్యండి.. దుమ్ము దులపండి అని చిన్నపాప సంగీత అనగానే సభలో ఈలలు, కేకలు వేశారు. ఇక అఖిల అనే అమ్మాయి మాట్లాడుతూ... రైతులు, విద్యార్థుల సమస్యలు తీరాలంటే 2019 సీఎం జగన్ కావాలని నినదించారు. అంతేకాకుండా తమ గ్రామం జగన్ వెంట ఉంటుందని పేర్కొంది. మొత్తం మీద తమ మనస్సులోని మాటలనే చిన్నపిల్లలైనప్పటికీ వారు వెలిబుచ్చారని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు గౌరుచరిత, ఐజయ్య, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి రాజగోపాల్ రెడ్డి, కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి హఫీజ్ ఖాన్, పార్టీ నేతలు అడ్వకేట్ మాధవ రెడ్డి, తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, సాయి, రఘు, రాజా విష్ణువర్దన్ రెడ్డి, నరసింహులు యాదవ్, హరినాథ రెడ్డి, మద్దయ్య, రాంమోహన్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, లోక్‌నాథ్ యాదవ్, కటారి సురేష్, మల్లికార్జున్, వెంకటేశ్వరరెడ్డి, హరికృష్ణ, దాదామియా, రాజశేఖర్, రాఘవేంద్ర, వహీదా, విజయలక్ష్మీ, అశోక్, సాంబ, ఫరూఖ్సాహెబ్, జహీర్ అహ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.