raitu karyacharana samithi
-
‘ఆధునికీకరణ’ చేయకే సాగునీటి ఎద్దడి
భీమవరం : డెల్టాలో ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం వల్లే సాగునీటి ఎద్దడి నెలకొందని పలువురు రైతు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రైతు కార్యచరణ సమితి సదస్సు జరిగింది. దీనిలో పలువురు ప్రజాప్రతినిధులు, నిపుణులు మాట్లాడారు. సాగునీటి కష్టాలను పరిష్కరించేందుకు డెల్టా పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు ఆ««దl్వర్యంలో జరిగిన సదస్సులో సమితి గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ యర్రా నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత డెల్టాలో మొదటిపంటకే సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 250 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోందని, అది పూర్తయితే డెల్టా ఎడారిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కృష్ణా, గోదావరి డ్రెయినేజీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల వెట్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.ఎ.రామకృష్ణంరాజు(పార్కురాజు) మాట్లాడుతూ.. డెల్టా పరిరక్షణకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. గోదావరిలోని నీరు సముద్రంలోకి కొంతమేర వెళ్లకుంటే సముద్రంలోని ఉప్పునీరు ఎగువకు చొచ్చుకువచ్చి భూములు ఉప్పునీటి కయ్యలుగా మారతాయని చెప్పారు. నిడదవోలు, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో రొయ్యల చెరువులు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.æ సదస్సులో నరసాపురం, నిడదవోలు ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, బూరుగుపల్లి శేషారావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామాంజనేయరాజు, రైతునాయకులు అక్కినేని భవానీప్రసాద్, పాతపాటి మురళీరామారాజు,ఎంవీ సూర్యనారాయణరాజు,పండురాజు, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఎస్వీ రంగరాజు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎత్తిపోతల పథకాలు, డెల్టా కాలువల్లో నెలకొన్న ఇబ్బందులపై పార్కురాజు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
‘ఆధునికీకరణ’ చేయకే సాగునీటి ఎద్దడి
భీమవరం : డెల్టాలో ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం వల్లే సాగునీటి ఎద్దడి నెలకొందని పలువురు రైతు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రైతు కార్యచరణ సమితి సదస్సు జరిగింది. దీనిలో పలువురు ప్రజాప్రతినిధులు, నిపుణులు మాట్లాడారు. సాగునీటి కష్టాలను పరిష్కరించేందుకు డెల్టా పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు ఆ««దl్వర్యంలో జరిగిన సదస్సులో సమితి గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ యర్రా నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత డెల్టాలో మొదటిపంటకే సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 250 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోందని, అది పూర్తయితే డెల్టా ఎడారిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కృష్ణా, గోదావరి డ్రెయినేజీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల వెట్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.ఎ.రామకృష్ణంరాజు(పార్కురాజు) మాట్లాడుతూ.. డెల్టా పరిరక్షణకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. గోదావరిలోని నీరు సముద్రంలోకి కొంతమేర వెళ్లకుంటే సముద్రంలోని ఉప్పునీరు ఎగువకు చొచ్చుకువచ్చి భూములు ఉప్పునీటి కయ్యలుగా మారతాయని చెప్పారు. నిడదవోలు, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో రొయ్యల చెరువులు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.æ సదస్సులో నరసాపురం, నిడదవోలు ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, బూరుగుపల్లి శేషారావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామాంజనేయరాజు, రైతునాయకులు అక్కినేని భవానీప్రసాద్, పాతపాటి మురళీరామారాజు,ఎంవీ సూర్యనారాయణరాజు,పండురాజు, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఎస్వీ రంగరాజు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎత్తిపోతల పథకాలు, డెల్టా కాలువల్లో నెలకొన్న ఇబ్బందులపై పార్కురాజు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.