Raja Harishchandra
-
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు... భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం. దేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు. దీన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం,శాలువా, రూ. పది లక్షలు ఇస్తారు. 1969లో తొలి అవార్డును దేవికా రాణికి ప్రదానం చేశారు. ఇప్పటివరకు పురస్కారాన్ని 45 మందికి అందజేశారు.భారత చలన చిత్ర పితామహుడైన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరిట ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన్నే దాదా సాహెబ్ ఫాల్కే అంటారు. భారతదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను ఆయన 1913లో నిర్మించారు. ఐదుగురు తెలుగు వారికి: దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇప్పటి వరకు ఐదు గురు తెలుగు వ్యక్తులకు బహుకరించారు. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974) ఎల్.వి.ప్రసాద్ (1982) బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986) అక్కినేని నాగేశ్వరరావు (1990) డి.రామానాయుడు (2009) 2013 పురస్కారం: ప్రముఖ హిందీ గేయరచయిత, దర్శకుడు గుల్జార్‌కు 2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే లభించింది. ఈ అవార్డును అందుకున్న 45వ వ్యక్తి గుల్జార్. ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. 1936లో బ్రిటిష్ ఇండియాలోని జీలం జిల్లాలో జన్మించారు. దేశ విభజన తర్వాత భారతదేశాన్ని చేరుకున్నారు. 1963లో బందినీ అనే హిందీ చిత్రానికి గేయ రచయితగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన మేరే అప్నే పరిచయ్, కోషిష్, అచానక్, ఆంధీ, మౌసమ్, అంగూర్ వంటి చిత్రాలకు దర్శకునిగా పనిచేశారు. 1988లో మీర్జా గాలిబ్ అనే దూరదర్శన్ సీరియల్‌కు దర్శకత్వం వహించారు. ఆయన ప్రముఖ నటి రాఖీని వివాహమాడారు. వారి కుమార్తె మేఘనా గుల్జార్ కూడా దర్శకురాలు. అవార్డుల వెల్లువ! గుల్జార్‌కు 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2004లో పద్మభూషణ్ లభించాయి. ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు 20 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు దక్కాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని జయహో పాటకు ఆస్కారు అవార్డు, 2010లో గ్రామీ అవార్డు, 2012లో ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డు కూడా లభించింది. నాటోలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య? ప్రాక్టీస్ బిట్స్ 1. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన టాప్-100 భారత అపర కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి? ఎ) లక్ష్మీ మిట్టల్ బి) అజీమ్ ప్రేమ్‌జీ సి) దిలీప్ సంఘ్వి డి) పల్లోంజీ మిస్త్రీ 2. ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్-100 భారత సంపన్నుల జాబితాలో ఎంతమంది మహిళలకు స్థానం లభించింది? ఎ) ఇద్దరు బి) నలుగురు సి) ఆరుగురు డి) పది 3. 2014 ఆసియా క్రీడల్లో సందీప్ సెజ్వాల్‌కు ఏ క్రీడలో కాంస్య పతకం లభించింది? ఎ) స్క్వాష్ బి) ఆర్చరీ సి) స్విమ్మింగ్ డి) షూటింగ్ 4. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) నూతన సెక్రటరీ జనరల్‌గా 2014, అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించింది ఎవరు? ఎ) గ్రో హార్లెమ్ బ్రంట్‌లాండ్ బి) ఎర్నా సోల్బర్గ్ సి) డోనాల్డ్ టస్క్ డి) జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ 5. అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి? ఎ) వి.గోపాల గౌడ బి) కురియన్ జోసెఫ్ సి) ఆర్.ఎఫ్.నారిమన్ డి) జాన్ మైకేల్ డీ కున్హా 6. 2016లో నాలుగో అణుభద్రత సదస్సు ఏ దేశంలో జరగనుంది? ఎ) దక్షిణ కొరియా బి) నెదర్లాండ్స్ సి) యూఎస్ఏ డి) ఫ్రాన్స్ 7. 2014 ఇండియన్ వెల్స్ టెన్నిస్ మహిళల టైటిల్‌ను గెలుచుకున్న ఫొవియా పెనెట్టా ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? ఎ) ఇటలీ బి) ఫ్రాన్స్ సి) చెక్ రిపబ్లిక్ డి) స్లొవేకియా 8. {పపంచంలో బంగారాన్ని అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశం ఏది? ఎ) రష్యా బి) భారత్ సి) అమెరికా డి) చైనా 9. ఇంగ్లిష్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పదం ఓకే (ౌజు)కు 2014, మార్చి 23 నాటికి ఎన్నేళ్లు నిండాయి? ఎ) 100 బి) 125 సి) 150 డి) 175 10. తొలిసారిగా ‘ఓకే’ అనే ఇంగ్లిష్ పదం ఏ అమెరికన్ పత్రికలో అచ్చు అయింది? ఎ) ద వాషింగ్టన్ పోస్ట్ బి) ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్ సి) ద డల్లాస్ మార్నింగ్ న్యూస్ డి) ద అగస్టా క్రానికల్ 11. ‘ప్రపంచ క్షయ దినం’? ఎ) మార్చి 21 బి) మార్చి 22 సి) మార్చి 24 డి) మార్చి 18 12. ఇటీవలే మరణించిన అడోల్ఫో సురెజ్ ఏ దేశానికి ప్రధానిగా 1976 నుంచి 1981 వరకు పనిచేశారు? ఎ) పోర్చుగల్ బి) స్పెయిన్ సి) ఫ్రాన్స్ డి) పోలండ్ 13. లండన్‌లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఏజేఏ) అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ? ఎ) అదితి ఖన్నా బి) రూపాంజనా దత్తా సి) స్మితా గుప్తా డి) నీనా వ్యాస్ 14. రష్యాలోని ఖాంటీ మన్‌సిస్క్‌లో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఎ) వ్లాదిమర్ క్రామ్నిక్ బి) పీటర్ స్విద్లర్ సి) అరోనియన్ డి) విశ్వనాథన్ ఆనంద్ 15. జాతీయ సీనియర్ పురుషుల హాకీ జట్టు కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు? ఎ) భాస్కరన్ బి) పర్గత్ సింగ్ సి) జూడ్ ఫెలిక్స్ డి) దిలీప్ టిర్కీ 16. లారెస్ క్రీడా పురస్కారాల్లో స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన అమెరికా క్రీడాకారిణి మిస్సీ ఫ్రాంక్లిన్ 2012 ఒలింపిక్స్‌లో ఏ క్రీడలో నాలుగు స్వర్ణాలను గెలుచుకుంది? ఎ) అథ్లెటిక్స్ బి) షూటింగ్ సి) స్విమ్మింగ్ డి) జిమ్నాస్టిక్స్ 17. సైంట్ లిమిటెడ్‌గా పేరు మార్చుకున్న సంస్థ? ఎ) హెచ్‌సీ ఎల్ బి) ఇన్ఫోటెక్ సి) ఇన్ఫోసిస్ డి) మైండ్ ట్రీ 18. బేసల్-3 నిబంధనలను అమలు చేయడానికి బ్యాంకులకు ఇచ్చిన గడువు? ఎ) 2019 మార్చి బి) 2018 మార్చి సి) 2020 మార్చి డి) 2015 మార్చి 19. కింది వాటిలో జాతీయం చేసిన బ్యాంకు? ఎ) ఎస్ బ్యాంకు బి) యాక్సిస్ బ్యాంకు సి) కెనరా బ్యాంకు డి) ఐసీఐసీఐ బ్యాంకు 20. శైవలాల (ఆల్గే) అధ్యయనాన్ని ఏమంటారు? ఎ) మైకాలజీ బి) ఫైకాలజీ సి) మయాలజీ డి) వైరాలజీ 21. 1893లో మహిళలకు తొలిసారి ఓటు హక్కును కల్పించిన దేశం? ఎ) యూకే బి) యూఎస్ఏ సి) పోలండ్ డి) న్యూజిలాండ్ 22. సుచేతా కృపలానీ 1963 నుంచి 1967 వరకు ఏ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఎ) ఒడిశా బి) మధ్యప్రదేశ్ సి) బీహార్ డి) ఉత్తరప్రదేశ్ 23. మామిడి పండ్ల ఎగుమతులపై నిషేధం విధించిన అంతర్జాతీయ సంస్థ? ఎ) ఆసియాన్ బి) నాటో సి) ఐరోపా యూనియన్ డి) ఓఈసీడీ 24. నాటోలో ప్రస్తుతం ఎన్ని సభ్యదేశాలున్నాయి? ఎ) 28 బి) 26 సి) 25 డి) 24 25. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఎ) సుమిత్ మజుందార్ బి) అజయ్ శ్రీరామ్ సి) నందన్ నీలేకని డి) ఎస్డీ శిబులాల్ 26. ఏ దేశంలోని పచ్చిక మైదానాలను ‘పంపాలు’ అంటారు? ఎ) అర్జెంటీనా బి) ఉరుగ్వే సి) బ్రెజిల్ డి) పైవన్నీ 27. అణ్వస్త్ర సామర్థ్యమున్న పృథ్వి-2 క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేదించగలదు? ఎ) 150 కిలోమీటర్లు బి) 350 కిలోమీటర్లు సి) 750 కిలోమీటర్లు డి) 550 మీటర్లు 28. ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ముగిసే వరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఎ) రవిశాస్త్రి బి) కపిల్‌దేవ్ సి) సునీల్ గవాస్కర్ డి) దిలీప్ వెంగ్‌సర్కార్ 29. సి-130 జే అనే అత్యాధునిక రవాణా విమానం ఇటీవల కూలిపోయింది. దీన్ని ఏ దేశం నుంచి కొనుగోలు చేశారు? ఎ) అమెరికా బి) యూకే సి) ఇజ్రాయెల్ డి) రష్యా 30. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఎ) స్విట్జర్లాండ్ బి) నెదర్లాండ్స్ సి) యునెటైడ్ కింగ్డమ్ డి) కెనడా సమాధానాలు 1) సి; 2) బి; 3) సి; 4) డి; 5) డి; 6) సి; 7) ఎ; 8) డి; 9) డి; 10) బి; 11) సి; 12) బి; 13) ఎ; 14) డి; 15) సి; 16) సి; 17) బి; 18) ఎ; 19) సి; 20) బి; 21) డి; 22) డి; 23) సి; 24) ఎ; 25) బి; 26) డి; 27) బి; 28) సి; 29) ఎ; 30) బి. పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించి భౌతిక రసాయన శాస్త్రం నుంచి అడిగే ప్రశ్నలు ఏవిధంగా ఉంటాయి? ఇందులోని ముఖ్యమైన అంశాలేవి? వాటిని ఏవిధంగా ప్రిపేర్ కావాలి? మధు, సంగారెడ్డి. పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో భౌతిక రసాయన శాస్త్రం నుంచి దాదాపుగా 7-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు నిత్య జీవిత ఉపయోగానికి అన్వయించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి, ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో అనే అంశాలను పరిశీలిస్తూ చదవడం ప్రయోజనకరం. ఇందులో ధ్వని, కాంతి, విద్యుత్, అయస్కాంతత్వం, రేడియోధార్మికత, లేజర్ కిరణాలు, ఎలక్ట్రానిక్స్, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, ద్రావణాలు-ఆమ్లాలు-క్షారాలు, కర్బన రసాయన శాస్త్రం, రసాయన నామాలు ముఖ్యమైన అంశాలు. అయితే ఇక్కడ గమనించాల్సింది సిలబస్‌లోని మొత్తం అంశాలను మొత్తంగా కాకుండా వాటి ప్రాధాన్యత మేరకు ప్రిపరేషన్ సాగించాలి. ఇందుకు 6-10వ తరగతి (పాత, కొత్త) సామాన్య శాస్త్ర పుస్తకాలను ఎంచుకోవాలి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన గత ఆబ్జెక్టివ్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. ముఖ్యమైన పాయింట్లు, స్థిరాంకాలు, ఫార్ములాలు తదితరలాను ఒక చోట నోట్స్‌లా రాసుకోవాలి. ప్రతీ అంశాన్ని వివరంగా, విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుంటూ చదవాలి. చదివేటప్పుడు ప్రతీ అంశాన్ని ప్రశ్న కోణంలో ఊహించుకుంటూ చదవడం మంచిది. గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ఏయే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయంపై స్పష్టత వస్తుంది. -నాగ రాజశేఖర్, సీనియర్ ఫ్యాకల్టీ. -
మన సినిమాకు మూలపురుషుడు
గత శతాబ్దపు తొలి రోజుల్లో, తెర మీద కదిలే బొమ్మల కళగా చలనచిత్రం ముందుకొస్తున్న మొదటినాళ్ళలో తన సమకాలికులు చాలా మంది కన్నా చలనచిత్ర రూపకల్పనలోని కళనూ, టెక్నిక్‌నూ మరింత మెరుగ్గా అర్థం చేసుకున్న భారతీయుడు-దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన రూపొందించిన తొలి మూవీ ‘రాజా హరిశ్చంద్ర’ (1913). భారతదేశంలో తయారైన తొలి పూర్తి నిడివి కథాకథనాత్మక చిత్రంగా ఆ సినిమా చరిత్రకెక్కింది. అలా తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శక, నిర్మాత కావడంతో దాదాసాహెబ్ ఫాల్కే ‘భారత చలనచిత్ర పరిశ్రమకు పితామహుడి’గా విశిష్టతను సంపాదించుకున్నారు. ‘దాదాసాహెబ్’గా ప్రసిద్ధుడైన ఆయన అసలు పేరు - ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని త్రయంబకంలో సంస్కృత పండితుల ఇంట జన్మించిన ఆయన ఎంతో శ్రమించి, తన సినీ కళా తృష్ణను తీర్చుకున్నారు. అప్పట్లో అన్నీ ఆయనే: ఈ కళా మాధ్యమం కొత్తగా దేశంలోకి వస్తున్న ఆ రోజుల్లో ఆయన వట్టి దర్శకుడు, నిర్మాతే కాదు. తన సినిమాకు తానే రచయిత, కళా దర్శకుడు, కెమేరామన్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్, ప్రాసెసర్, ప్రింటర్, డెవలపర్, ప్రొజెక్షనిస్టు, డిస్ట్రిబ్యూటర్ కూడా అంటే ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కెమేరా, ప్రాసెసింగ్ యంత్రం, ముడి ఫిల్మ్ మినహా మిగతాదంతా దేశవాళీ సాంకేతిక నైపుణ్యంతో ఫాల్కే తొలి ఫీచర్‌ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ తీయడం ఓ చరిత్ర. తెరపై బొమ్మలు కదలడమే తప్ప మాట్లాడని ఆ మూకీ సినీ యుగంలో దాదాపు పాతికేళ్ళ వ్యవధిలో ఆయన 100 సినిమాలు, 30 లఘు చిత్రాలు రూపొందించారు. సినిమా మాట నేర్చి, టాకీలు వచ్చాక ఆయన హిందీ, మరాఠీ భాషల్లో కొల్హాపూర్ సినీటోన్‌కు ‘గంగావతరణ్’ తీశారు. ఫాల్కేకు అదే తొలి టాకీ అనుభవం. తీరా అదే ఆయన ఆఖరి చిత్రం కూడా కావడం విచిత్రం. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలై, చిత్ర పరిశ్రమలో తగినంత గుర్తింపునకు కూడా నోచుకోని ఫాల్కే 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో కన్నుమూశారు. అత్యున్నత సినీ పురస్కారం: మన దేశ సినీపరిశ్రమకు పునాదులు వేసిన తొలితరం వ్యక్తి ఫాల్కేను నిరంతరం గుర్తు చేసుకొనేందుకు వీలుగా ఆయన శతజయంతి సందర్భంగా ఆయన పేరు మీద భారత ప్రభుత్వం 1969లో ప్రత్యేకంగా ఓ అవార్డును నెలకొల్పింది. అలాగే, శతజయంతి పూర్తయిన వేళ భారత తంతి, తపాలా శాఖ 1971 ఏప్రిల్ 30న ఫాల్కేపై ప్రత్యేక తపాలా బిళ్ళ, కవరు విడుదల చేసింది. భారతీయ సినిమా పురోభివృద్ధికి వివిధ మార్గాలలో విశేషంగా సేవలందించిన సినీ రంగ కురువృద్ధులకు ఒకరికి ప్రతి ఏటా ప్రత్యేక గుర్తింపుగా ఇచ్చే అత్యున్నత పురస్కారమే -‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’. దీన్ని ‘భారతీయ ఆస్కార్ అవార్డు‘గా పరిగణిస్తారు. జీవన సాఫల్యంగా ఇచ్చే పురస్కారం 1969లో నటి దేవికారాణి మొదలుకొని తాజాగా 2013వ సంవత్సరానికి గాను కవి, దర్శక, నిర్మాత గుల్జార్ వరకు ఇప్పటి వరకు 45 మంది భారతీయ సినీ దిగ్గజాలను వరించింది. మొదట్లో ఈ పురస్కార గ్రహీతలకు ఓ ప్రశంసా ఫలకం, శాలువా, రూ. 11 వేల నగదుతో సత్కరించేవారు. కాలక్రమంలో అది పెరుగుతూ వచ్చి, గడచిన పదేళ్ళ నుంచి ‘ఫాల్కే అవార్డు గ్రహీత’లను స్వర్ణ కమలం, శాలువా, పది లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డును అందుకున్న తెలుగువారిలో అన్నదమ్ములైన దర్శకుడు బి.ఎన్. రెడ్డి (1974), నిర్మాత బి. నాగిరెడ్డి(’86), అలాగే మూకీ కాలం నుంచి నటుడైన హైదరాబాదీ పైడి జైరాజ్ (’80), దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ (’82), హీరో అక్కినేని నాగేశ్వరరావు (’90), నిర్మాత డి. రామానాయుడు (2009), హైదరాబాద్‌తో అనుబంధమున్న దర్శకుడు శ్యామ్ బెనెగల్ (2005) ఉన్నారు. మన దర్శక, నిర్మాతల్లో, సాంకేతిక నిపుణుల్లో ఆ స్థాయిని అందుకొనే అర్హత ఇంకా చాలామందికి ఉన్నా, ఆ గౌరవం దక్కకపోవడం మాత్రం విషాదమే! - రెంటాల జయదేవ