in rajamahendravaram
-
నేడు డీజీపీ కీలక సమావేశం
రాజమహేంద్రవరం క్రైం : రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఎ¯ŒS.సాంబశివరావు గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారని రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు లాహస్పి¯ŒS హోటల్ కాన్ఫరె¯Œ్స హాల్లో నిర్వహించే ఈ సమావేశంలో గంజాయి సాగు, అక్రమ రవాణా నిరోధంపై చర్చిస్తారని తెలిపారు. అడిషినల్ డీజీలు ఎ.బి.వెంకటేశ్వరరావు, సిహెచ్.ద్వారకా తిరుమల రావు (సీఐడీ), కె.ఆర్.ఎం.కిషోర్ కుమార్ (రైల్వేస్), హరీష్ కుమార్గుప్తా (లా అండ్ ఆర్డర్), ఐజీపీలు కుమార్ విశ్వజిత్ (నార్త్ కోస్టల్ జో¯ŒS), ఎ¯ŒS.సంజయ్ (సౌత్ కోస్టల్ జో¯ŒS), మహేష్ చంద్ర లడ్డా (ఇంటిలిజ¯Œ్స), అమిత గర్గ్ (సీఐడీ), విశాఖపట్నం పోలీస్ కమిషనర్ టి.యోగానంద్, డైరెక్టర్ కె.వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. వీరితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లు, విజయవాడ రైల్వే ఎస్ఎస్పీ గుంతకల్లు శ్రీనివాస్, పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రోహిబిష¯ŒS అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, రెవెన్యూ, ఇంటిలిజె¯Œ్స, నార్కోటెక్ బ్యూరో, సెంట్రల్ ఎక్సైజ్, అండ్ కస్టమ్స్ శాఖ తదితర శాఖలకు చెందిన అధికారులు సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. -
పాత్రధారులే.. సూత్రధారులు
స్థలం రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో కొత్త ట్విస్ట్ స్థలం బండారు వెంకటరమణదని తెలిసీ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులు నాలుగోవాటా యజమాని నుంచి మొత్తం రిజిస్ట్రేష¯ŒSకు సంతకాలు తనకు తెలియదన్న నాలుగోవాటా యజమాని ఆదికేశవులనాయుడు పోలీసులకు రాతపూర్వకంగా విషయం వెల్లడి సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం సూరాబత్తులవీధిలోని 356 గజాల స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వ్యవహారంలో సూత్రదారులే పాత్రదారులని వెల్లడైంది. ఈ స్థలం బండారు వెంకటరమణ కుటుంబానికి చెందిందని తెలిసీ కూడా దాన్ని ఎలాగైనా కాజేయాలన్న కుట్రతో నిందితులు వ్యవహారించారా?, 1/4 స్థలం యజమానికి తెలియకుండా మొత్తం ఆస్తికి నకిలీ పత్రాలు సృష్టించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తన వాటా ఆస్తిని విక్రయించాలని తాము భావించామని, అయితే మొత్తం ఆస్తిని రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటున్నట్లు తమకు తెలియదని నాలుగో వాటా యజమాని బి.ఆదికేశవులనాయుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడలో ఉంటున్న ఆదికేశవులనాయుడు వద్దకు వెళ్లిన పోలీసులకు మొత్తం ఆస్తిని రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటున్నట్లు తమకు వారు చెప్పలేదని ఆదికేశవులనాయుడు పేర్కొన్నారు. డాక్యుమెంట్లు తెలుగులో రాయించారని, తమకు తెలుగు చదవడం రాదని ఆదికేశవులనాయుడు పోలీసులకు చెప్పారు. ఈ మేరకు రాతపూర్వకంగా పోలీసులకు వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేష¯ŒS సూరాబత్తుల వీధిలోని స్థలం బండారు వెంకటరమణ కుటుంబానికి చెందిందని తెలిసి నిందితులు కుట్రపూరితంగా రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారా? అనే అనుమానాలకు పోలీసులకు వెంకటరమణ చేసిన ఫిర్యాదులో ఉన్న సమాచారం ఇందుకు బలం చేకూరుస్తోంది. బాధితుడి ఫిర్యాదులో రాజమండ్రికి చెందిన లంకా వెంకట అప్పారావు, కె.బ్రహ్మాజీ, ధవళేశ్వరానికి చెందిన దంగుడుబియ్యం నారాయణతో కలసి రావులపాలెంకు చెందిన సత్తార్ అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని పేర్కొన్నారు. ఇందులో లంకా వెంకట అప్పారావు స్థలం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారిగా ఉంటున్నారు. ఇతనికి, కె.బ్రహ్మాజీ, దంగుడుబియ్యం నారాయణకు ఈ స్థలం బండారు వెంకటరమణ కుటుంబానిదేన్న విషయం తెలుసు. అయితే స్థలానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు నాలుగోవాటా యజమాని వద్ద ఉండడంతో మొత్తం ఆస్తిని కాజేయాలనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దానిని మళ్లీ దంగుడుబియ్యం నారాయణ, లంకా వెంకట అప్పారావు, ఆకుల సాయిబాబా, షేక్ మీరాసాహెబ్, తలసెట్ల నాగరాజు, పోలాకి పరమేశ్వరరావు, మద్దు శ్రీనివాస్, మట్టా నరసింహరాజు రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వారు రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వారిలో కూడా ఉండడంతో ఈ వ్యవహారంలో అందరూ భాగస్వాములైనట్లు స్పష్టమైంది.