- స్థలం రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో కొత్త ట్విస్ట్
- స్థలం బండారు వెంకటరమణదని తెలిసీ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులు
- నాలుగోవాటా యజమాని నుంచి మొత్తం రిజిస్ట్రేష¯ŒSకు సంతకాలు
- తనకు తెలియదన్న నాలుగోవాటా యజమాని ఆదికేశవులనాయుడు
- పోలీసులకు రాతపూర్వకంగా విషయం వెల్లడి
పాత్రధారులే.. సూత్రధారులు
Published Tue, Jan 10 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
సాక్షి, రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం సూరాబత్తులవీధిలోని 356 గజాల స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వ్యవహారంలో సూత్రదారులే పాత్రదారులని వెల్లడైంది. ఈ స్థలం బండారు వెంకటరమణ కుటుంబానికి చెందిందని తెలిసీ కూడా దాన్ని ఎలాగైనా కాజేయాలన్న కుట్రతో నిందితులు వ్యవహారించారా?, 1/4 స్థలం యజమానికి తెలియకుండా మొత్తం ఆస్తికి నకిలీ పత్రాలు సృష్టించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తన వాటా ఆస్తిని విక్రయించాలని తాము భావించామని, అయితే మొత్తం ఆస్తిని రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటున్నట్లు తమకు తెలియదని నాలుగో వాటా యజమాని బి.ఆదికేశవులనాయుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడలో ఉంటున్న ఆదికేశవులనాయుడు వద్దకు వెళ్లిన పోలీసులకు మొత్తం ఆస్తిని రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటున్నట్లు తమకు వారు చెప్పలేదని ఆదికేశవులనాయుడు పేర్కొన్నారు. డాక్యుమెంట్లు తెలుగులో రాయించారని, తమకు తెలుగు చదవడం రాదని ఆదికేశవులనాయుడు పోలీసులకు చెప్పారు. ఈ మేరకు రాతపూర్వకంగా పోలీసులకు వెల్లడించారు.
నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేష¯ŒS
సూరాబత్తుల వీధిలోని స్థలం బండారు వెంకటరమణ కుటుంబానికి చెందిందని తెలిసి నిందితులు కుట్రపూరితంగా రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారా? అనే అనుమానాలకు పోలీసులకు వెంకటరమణ చేసిన ఫిర్యాదులో ఉన్న సమాచారం ఇందుకు బలం చేకూరుస్తోంది. బాధితుడి ఫిర్యాదులో రాజమండ్రికి చెందిన లంకా వెంకట అప్పారావు, కె.బ్రహ్మాజీ, ధవళేశ్వరానికి చెందిన దంగుడుబియ్యం నారాయణతో కలసి రావులపాలెంకు చెందిన సత్తార్ అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని పేర్కొన్నారు. ఇందులో లంకా వెంకట అప్పారావు స్థలం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారిగా ఉంటున్నారు. ఇతనికి, కె.బ్రహ్మాజీ, దంగుడుబియ్యం నారాయణకు ఈ స్థలం బండారు వెంకటరమణ కుటుంబానిదేన్న విషయం తెలుసు. అయితే స్థలానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు నాలుగోవాటా యజమాని వద్ద ఉండడంతో మొత్తం ఆస్తిని కాజేయాలనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దానిని మళ్లీ దంగుడుబియ్యం నారాయణ, లంకా వెంకట అప్పారావు, ఆకుల సాయిబాబా, షేక్ మీరాసాహెబ్, తలసెట్ల నాగరాజు, పోలాకి పరమేశ్వరరావు, మద్దు శ్రీనివాస్, మట్టా నరసింహరాజు రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వారు రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వారిలో కూడా ఉండడంతో ఈ వ్యవహారంలో అందరూ భాగస్వాములైనట్లు స్పష్టమైంది.
Advertisement
Advertisement