రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
వేములవాడ, న్యూస్‌లైన్ : రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి నెలకొంది. రాజన్నను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు బారులు తీరారు. 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆర్జిత, ఇతర సేవల ద్వారా రూ.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల కౌంటర్వద్ద తోపులాట చోటుచేసుకుంది. సినీ దర్శకుడు సురేందర్‌రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సీఐడీ డీఎస్పీ భాస్కర్, ఆర్టీసీ డీఎస్పీ రాజేంద్రప్రసాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చకులు, ట్రస్టుబోర్డు సభ్యుడు అరుణ్‌తేజాచారీ ప్రసాదాలు అందజేశారు. ఏర్పాట్లను ఆలయ ఈవో కృష్ణాజిరావు, ఏఈవోలు హరికిషన్, ఉమారాణి, దేవేందర్, గౌరీనాథ్ పర్యవేక్షించారు.
వైభవంగా మహాలింగార్చన
రాజన్న ఆలయంలో సోమవారం మహాలింగార్చన వైభవంగా నిర్వహించారు. మొత్తం 14 మంది అర్చక స్వాములు ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. లింగస్వరూపుడి ఆకారంలో పేర్చిన జ్యోతులు వెలిగించి పూజలు చేశారు.