వర్షాల కారణంగా వాయిదా
గత 20 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు సామాన్య ప్రజలతో పాటు సినీ రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బ తీశాయి. పొంగల్ రేసులో స్టార్ హీరోలు బరిలో ఉంటారని భావించి, ముందే రిలీజ్‌కు సిద్దమైన చిన్న సినిమాలు ఈ వర్షాలతో వాయిదా వేసుకోక తప్పలేదు. ఇప్పటికే వేదలం, తుంగావనం లాంటి సినిమాలు వర్షాల కారణంగా కలెక్షన్లు పొగొట్టుకోగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి.
వరుస హిట్స్‌తో ఫాంలో ఉన్న శివకార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ రజనీమురగన్ ఈ శుక్రవారం విడుదల కావల్సి ఉండగా ఆ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు అధర్వ, శ్రీదివ్య జంటగా తెరకెక్కిన ఏటి, నేషనల్ అవార్డ్ విన్నర్ బాబీ సింహా లీడ్ రోల్లో తెరకెక్కిన ఉరుమీన్, తిరుట్టు రైల్ లాంటి సినిమాల రిలీజ్‌లను వాయిదా వేశారు.