టీడీపీవి ప్రలోభ రాజకీయాలు
మెంటాడ: మెంటాడ టీడీపీ నాయకులు తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆరోపించారు. శనివారం ఆయన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మెం టాడ ఎంపీపీ స్థానాన్ని ఎస్టీకి కేటాయించారని, బడేవలస, జక్కువ ఎంపీటీసీ స్థానాలను ఎస్టీలకు కేటాయించడంతో అక్కడ తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. మండలంలో 13 ఎంపీటీసీ స్థానాల్లో తమ పార్టీకి 6, టీడీపీ 7 స్థానాలు గెలుచుకుందని, అయితే టీడీపీకి ఎస్టీ రిజర్వ్ ఎంపీటీసీ లేకపోవడంతో వారు తమ పార్టీ ఎస్టీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరో పించారు.
తమ అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు లొంగరని, ఈ మేరకు విప్ జారీ చేశామని చెప్పారు. ప్రమాణ స్వీకారం, కో- ఆప్షన్ ఎన్నికకు హాజరైన టీడీపీ ఎంపీటీసీ సభ్యులు... ఎంపీపీ, వైస్ ఎం పీపీ ఎన్నికకు హాజరుకాకపోవడం సరికాదన్నారు. ప్రిసైడింగ్ అధికారి వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నిక నిర్వహించడానికి చర్యలు చేపట్టాల్సిన తీసుకోవాలన్నా రు. ఇక్కడ పరిస్థితులను ఎన్నికల కమిషన్కు వివరించాలని కోరారు. ఎన్నిక ఎప్పుడు జరిగినా... తమ పార్టీ అభ్యర్థే ఎంపీపీగా ఎన్నికవుతారని స్పష్టం చేశారు. ఇక్కడ వాస్తవాన్ని ప్రిసైడింగ్ అధికారి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది, లేనిది సమాచార హక్కు చట్టం కింద కోరుతామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.
మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు
తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాము తీర్ధ యాత్రలకు వెళ్లామని బడేవలస ఎంపీటీసీ సభ్యురాలు పద్దు అమల(వైఎస్సార్ సీపీ), ఆమె భర్త తౌడన్న దొర తెలిపా రు. తమను కిడ్నాప్ చేసినట్టు ఆండ్ర పోలీస్స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలియడంతో హుటా హుటిన స్వగ్రామానికి వచ్చామని చెప్పారు. శనివారం సాయంత్రం వారు ఎమ్మె ల్యే పీడిక రాజన్నదొర సమక్షంలో విలేకరుతో మాట్లా డారు. తమ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో ఎవ రో చెప్పిన తప్పుడు మాటలు విని పోలీసులకు ఫిర్యాదు చేశారని, తీర్ధ యాత్రలకు వెళ్లే ముందు ఎమ్మెల్యే రాజన్నదొరకు, తమ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
తమ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలిని కిడ్నాప్ చేశార ంటూ పద్దు అమల తల్లిదండ్రులతో తప్పుడు ఫిర్యాదు చేయిం చిన వారిని పోలీ సులు గుర్తించి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పోలీసులను కోరారు. ఇటువంటి తప్పుడు కేసులు ఇకపై పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యుతలపై చర్య లు తీసుకోవాలన్నారు.