RajaRadham
-
రాజరథం కోసం తెలుగు నేర్చుకున్నా
‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మూవీ ‘రాజరథం’. అభి అనే మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా కనపడతా. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా. అడగ్గానే రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆర్య ముఖ్యమైన పాత్ర చేశారు’’ అని నిరూప్ భండారి అన్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘రాజరథం’. అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి నిర్మాతలు. ఈ సినిమా రేపు విడుదలవుతోంది. నిర్మాతల్లో ఒక్కరైన సతీష్ శాస్త్రి మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన మా జాలీ హిట్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రాజరథం’. అజనీశ్ లోక్‌నాథ్ ఈ సినిమాకు చక్కటి నేపథ్య సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమాకు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ అన్నీ మా సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది’’ అన్నారు అవంతిక శెట్టి. -
విలన్‌గా మారిన మరో హీరో..?
కోలీవుడ్, మాలీవుడ్ యంగ్ హీరోలు టాలీవుడ్ లో ప్రతినాయకులుగా కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆది, ఉన్ని ముకుందన్ లాంటి స్టార్లు టాలీవుడ్ లో మంచి విజయాలు సాధించారు. తాజాగా మరో కోలీవుడ్ నటుడు విలన్ రోల్ లో కనిపించనున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న రాజరథం సినిమాలో తమిళ నటుడు ఆర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో కీలకమైన బస్సు పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో రానా డబ్బింగ్ చెబుతుండటంతో టాలీవుడ్ లోనూ ఈసినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అనూప్ బండారీ దర్శకత్వంలో నిరూప్ బండారీ, అవంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రాజరథం. ఈ సినిమాలో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆర్యది విలన్ రోల్ అని తెలుస్తోంది. మరి నిజంగా ఆర్య నెగెటివ్ రోల్ లో నటిస్తున్నాడా లేదా తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
మార్చి మూడోవారంలో ‘రాజరథం’
నిరూప్ బండారి, అంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా రాజరథం. తమిళ నటుడు ఆర్య, రవిశంకర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన బస్సు పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో రానా డబ్బింగ్ చెపుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా జనవరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాని కారణంగా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు కొత్త డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 23న రిలీజ్ చేయనున్నారు. అనూప్ బండారీ దర్శకత్వంలో 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ బండారీ, అజనీష్ లోక్‌నాథ్‌లు సంగీతమందిస్తున్నారు. -
నేను కనిపించను.. వినిపిస్తాను – రానా
‘‘నా దృష్టిలో హద్దులను చెరిపేసే కథలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో ‘రాజరథం’ ఒకటి. ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. నేనూ చూడటానికి ఇష్టపడటంతో పాటు ఇటువంటి కథలతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతా. ఈ సినిమాలో నేను కనిపించను.. వినిపిస్తాను. విలక్షణమైన కథతో రూపొందిన ‘రాజరథం’ తెలుగులో పెద్ద సక్సెస్ సాధిస్తుంది’’ అని హీరో రానా అన్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘రాజరథం’ జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని రానా రిలీజ్ చేశారు. అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘రంగితరంగ’ (కన్నడ) వంటి హిట్ మూవీ తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘రాజరథం’. ఈ చిత్రానికి సంగీతం కూడా నేనే అందించా. మా నాన్న సుధాకర్ భండారిగారు తెలుగులో చాలా సినిమాలకు పనిచేశారు. నా ఫేవరెట్ మూవీ ‘గీతాంజలి’తో పాటు చిరంజీవిగారి సినిమాలకు పనిచేశారు’’ అన్నారు. ‘‘రాజరథం’కి ముందు తెలుగు వచ్చేది కాదు. డబ్బింగ్ చెప్పే సమయానికి తెలుగు నేర్చుకున్నాను. డైరెక్షన్, మ్యూజిక్ అన్నయ్య చేస్తే, కాస్ట్యూమ్స్‌ను వదిన డిజైన్ చేశారు’’ అన్నారు నిరూప్ భండారి. -
‘రాజరథం’ ట్రైలర్ రిలీజ్ చేసిన రానా