సతీష్ శాస్త్రి, అవంతిక, రానా, నిరూప్ భండారి, అనూప్ భండారి
‘‘నా దృష్టిలో హద్దులను చెరిపేసే కథలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో ‘రాజరథం’ ఒకటి. ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. నేనూ చూడటానికి ఇష్టపడటంతో పాటు ఇటువంటి కథలతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతా. ఈ సినిమాలో నేను కనిపించను.. వినిపిస్తాను. విలక్షణమైన కథతో రూపొందిన ‘రాజరథం’ తెలుగులో పెద్ద సక్సెస్ సాధిస్తుంది’’ అని హీరో రానా అన్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘రాజరథం’ జనవరి 25న విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్‌ని రానా రిలీజ్ చేశారు. అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘రంగితరంగ’ (కన్నడ) వంటి హిట్ మూవీ తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘రాజరథం’. ఈ చిత్రానికి సంగీతం కూడా నేనే అందించా. మా నాన్న సుధాకర్ భండారిగారు తెలుగులో చాలా సినిమాలకు పనిచేశారు. నా ఫేవరెట్ మూవీ ‘గీతాంజలి’తో పాటు చిరంజీవిగారి సినిమాలకు పనిచేశారు’’ అన్నారు. ‘‘రాజరథం’కి ముందు తెలుగు వచ్చేది కాదు. డబ్బింగ్ చెప్పే సమయానికి తెలుగు నేర్చుకున్నాను. డైరెక్షన్, మ్యూజిక్ అన్నయ్య చేస్తే, కాస్ట్యూమ్స్‌ను వదిన డిజైన్ చేశారు’’ అన్నారు నిరూప్ భండారి.
Comments
Please login to add a commentAdd a comment