Nirup Bhandari
-
రాజరథం కోసం తెలుగు నేర్చుకున్నా
‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మూవీ ‘రాజరథం’. అభి అనే మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా కనపడతా. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా. అడగ్గానే రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆర్య ముఖ్యమైన పాత్ర చేశారు’’ అని నిరూప్ భండారి అన్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘రాజరథం’. అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి నిర్మాతలు. ఈ సినిమా రేపు విడుదలవుతోంది. నిర్మాతల్లో ఒక్కరైన సతీష్ శాస్త్రి మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన మా జాలీ హిట్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రాజరథం’. అజనీశ్ లోక్‌నాథ్ ఈ సినిమాకు చక్కటి నేపథ్య సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమాకు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ అన్నీ మా సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది’’ అన్నారు అవంతిక శెట్టి. -
విలన్‌గా మారిన మరో హీరో..?
కోలీవుడ్, మాలీవుడ్ యంగ్ హీరోలు టాలీవుడ్ లో ప్రతినాయకులుగా కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆది, ఉన్ని ముకుందన్ లాంటి స్టార్లు టాలీవుడ్ లో మంచి విజయాలు సాధించారు. తాజాగా మరో కోలీవుడ్ నటుడు విలన్ రోల్ లో కనిపించనున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న రాజరథం సినిమాలో తమిళ నటుడు ఆర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో కీలకమైన బస్సు పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో రానా డబ్బింగ్ చెబుతుండటంతో టాలీవుడ్ లోనూ ఈసినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అనూప్ బండారీ దర్శకత్వంలో నిరూప్ బండారీ, అవంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రాజరథం. ఈ సినిమాలో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆర్యది విలన్ రోల్ అని తెలుస్తోంది. మరి నిజంగా ఆర్య నెగెటివ్ రోల్ లో నటిస్తున్నాడా లేదా తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
మార్చి మూడోవారంలో ‘రాజరథం’
నిరూప్ బండారి, అంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా రాజరథం. తమిళ నటుడు ఆర్య, రవిశంకర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన బస్సు పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో రానా డబ్బింగ్ చెపుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా జనవరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాని కారణంగా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు కొత్త డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 23న రిలీజ్ చేయనున్నారు. అనూప్ బండారీ దర్శకత్వంలో 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ బండారీ, అజనీష్ లోక్‌నాథ్‌లు సంగీతమందిస్తున్నారు. -
నేను కనిపించను.. వినిపిస్తాను – రానా
‘‘నా దృష్టిలో హద్దులను చెరిపేసే కథలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో ‘రాజరథం’ ఒకటి. ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. నేనూ చూడటానికి ఇష్టపడటంతో పాటు ఇటువంటి కథలతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతా. ఈ సినిమాలో నేను కనిపించను.. వినిపిస్తాను. విలక్షణమైన కథతో రూపొందిన ‘రాజరథం’ తెలుగులో పెద్ద సక్సెస్ సాధిస్తుంది’’ అని హీరో రానా అన్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘రాజరథం’ జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని రానా రిలీజ్ చేశారు. అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘రంగితరంగ’ (కన్నడ) వంటి హిట్ మూవీ తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘రాజరథం’. ఈ చిత్రానికి సంగీతం కూడా నేనే అందించా. మా నాన్న సుధాకర్ భండారిగారు తెలుగులో చాలా సినిమాలకు పనిచేశారు. నా ఫేవరెట్ మూవీ ‘గీతాంజలి’తో పాటు చిరంజీవిగారి సినిమాలకు పనిచేశారు’’ అన్నారు. ‘‘రాజరథం’కి ముందు తెలుగు వచ్చేది కాదు. డబ్బింగ్ చెప్పే సమయానికి తెలుగు నేర్చుకున్నాను. డైరెక్షన్, మ్యూజిక్ అన్నయ్య చేస్తే, కాస్ట్యూమ్స్‌ను వదిన డిజైన్ చేశారు’’ అన్నారు నిరూప్ భండారి. -
... టు టాలీవుడ్
‘రంగితరంగ’ అనే కన్నడ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నిరూప్ భండారి ‘రాజరథం’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ముంబయ్ బ్యూటీ అవంతికా శెట్టి హీరోయిన్. తమిళ హీరో ఆర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనూప్ భండారి దర్శకత్వంలో అజయ్‌రెడ్డి గొల్లపల్లి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్ శాస్త్రి తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజరథం’ చిత్రంలోని నిరూప్ లుక్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. అనూప్ భండారి మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. నిరూప్ కాలేజ్ స్టూడెంట్‌గా కనిపిస్తారు. కొన్ని రిస్కీ ఫైట్స్‌ను డూప్ లేకుండా చేశారు. ఆ సమయంలో చేతికి గాయాలవడంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అందువల్ల టైటిల్ సాంగ్ చిత్రీకరణ ఆలస్యమైంది. ఈ పాటను జానీ మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నాం. ఈ సినిమాలోని అన్ని మెలోడీ, ఫాస్ట్ బీట్ సాంగ్స్‌ని అనూప్ భండారి కంపోజ్ చేయడం విశేషం. రామజోగయ్యశాస్త్రి పాటలు, అబ్బూరి రవి మాటలు రాశారు’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుధాకర్ సాజ. -
ద్రవిడ్ ఒప్పుకుంటాడా?
బెంగళూరు: టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్ జీవిత కథల ఆధారంగా బాలీవుడ్లో ఇప్పటికే సినిమాలు తెరకెక్కాయి. ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ జీవితకథను కూడా సిల్వర్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. రంగి తరంగ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ప్రముఖ కన్నడ దర్శకుడు అనూప్ భండారి, నటుడు నిరూప్ భండారి ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ముందుకు వచ్చారు. క్రికెట్లోనూ ప్రావీణ్యమున్న వీరిద్దరూ తమకు ఆరాధ్యుడైన ద్రవిడ్ జీవిత కథను సినిమాగా తీయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ‘కర్ణాటక రాష్ట్రానికి చెందిన ద్రవిడ్ గురించి ఎవరైనా సినిమా తీయాలనుకుంటే కళ్లుమూసుకుని నిరూప్ను ప్రధాన పాత్రకు తీసుకోవచ్చు. అతడి స్వభావం, వ్యక్తిత్వం, మూర్తిమత్వం ద్రవిడ్‌కు దగ్గరకు ఉంటుంది. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే తెరకెక్కించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ద్రవిడ్ అనుమతి ఇస్తేనే ఈ సినిమా రూపొందిస్తాన’ని దర్శకుడు అనూప్ భండారి తెలిపారు. వ్యక్తిగత జీవితం గురించి బయట చర్చించడానికి ఇష్టపడని రాహుల్ ద్రవిడ్ దీనికి ఒప్పుకుంటాడో, లేదో చూడాలి.