రాజరథం కోసం తెలుగు నేర్చుకున్నా | nirup bhandari rajaratham movie released on march 23 | Sakshi
Sakshi News home page

రాజరథం కోసం తెలుగు నేర్చుకున్నా

Published Thu, Mar 22 2018 12:14 AM | Last Updated on Thu, Mar 22 2018 12:14 AM

nirup bhandari rajaratham movie released on march 23 - Sakshi

నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి

‘‘రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మూవీ ‘రాజరథం’. అభి అనే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిగా కనపడతా. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా. అడగ్గానే  రానా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఆర్య ముఖ్యమైన పాత్ర చేశారు’’ అని నిరూప్‌ భండారి అన్నారు. నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం ‘రాజరథం’. అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి నిర్మాతలు.

ఈ సినిమా రేపు విడుదలవుతోంది. నిర్మాతల్లో ఒక్కరైన సతీష్‌ శాస్త్రి మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన మా జాలీ హిట్స్‌ సంస్థ నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రాజరథం’. అజనీశ్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు చక్కటి నేపథ్య సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమాకు ఉండాల్సిన బెస్ట్‌ క్వాలిటీస్‌ అన్నీ మా సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది’’ అన్నారు అవంతిక శెట్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement