మహిళపై దాడి కేసులో ఆరుగురికి జైలు
లీగల్ (కడప అర్బన్) : కడపలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజారెడ్డివీధికి చెందిన రాషిదాభానుపై గతేడాది మే 3న ఆరుగురు దాడి చేసి అవమానపరిచినట్లు కేసు నమోదు అయింది. నేరం రుజువు కావడంతో ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ లావణ్య ఆరుగురికి ఒక్కొక్కరికి ఏడాది పాటు జైలుశిక్ష, రూ. 1500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. శిక్షపడిన వారిలో రాజేశ్వరి, మౌనిక, గీత, విశాల్, దినేష్, బసిరెడ్డి ఉన్నారు.