rajastan high court
-
అతడు రాక్షసుడిలా అనిపిస్తున్నాడు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మహిళను అత్యంత పాశవికంగా హత్యచేసిన కేసులో దోషిగా ఉన్న వ్యక్తికి కిందికోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి వాదనలు పూర్తయ్యేంత వరకు మరణశిక్షను నిలుపుదల చేసేలా బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్యాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇలాంటి కేసును మేమెప్పుడూ చూడలేదు. అతడు ఓ రాక్షసుడిలా అనిపిస్తున్నాడు’’అని వ్యాఖ్యానించింది. కాగా ఓ బిల్డింగ్ కాంప్లెక్సులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మోహన్ సింగ్ అనే వ్యక్తి 2019లో ఓ మహిళను దారుణంగా హతమార్చాడు. ఆమె పొట్టను చీల్చి, అవయాలను బయటకు తీశాడు. ఆ తర్వాత వాటి స్థానంలో వస్త్రాన్ని కుక్కి, వైరుతో కుట్లు వేశాడు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికపోయాడు.(చదవండి: ‘గృహ హింస’ బాధితురాలికి ఊరట) ఈ నేపథ్యంలో మోహన్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఆధారాలు సేకరించి ట్రయల్స్ కోర్టు ఎదుట హాజరుపరచగా, అనేక పరిణామాల అనంతరం న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. రాజస్తాన్ హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్థిస్తూ ఈ ఏడాది ఆగష్టు 9న శిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో దోషి తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషికి ఉరిశిక్షను నిలుపుదల చేసే విధంగా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా.. ‘‘మీ క్లైంట్ చాలా హేయమైన చర్యకు పాల్పడ్డారు. అసలెందుకు అతడు, పొట్ట చీల్చి అందులో వస్త్రాలు పెట్టినట్లు? అతడేమైనా సర్జనా?’’ అని న్యాయస్థానం ఆయనను ప్రశ్నించింది. ఇందుకు బదులుగా.. మోహన్ సింగ్‌ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, గతంలో ఓ హత్యకేసులో దోషిగా ఉన్నందున ఈ నేరం తనపై మోపారని లూథ్రా వాదనలు వినిపించారు. మృతురాలు చివరిసారిగా అతడితో మాట్లాడిందన్న ఒకే ఒక్క కారణంతో అతడే హత్యకు పాల్పడ్డాడన్న నిర్ధారణకు సరైంది కాదని పేర్కొన్నారు. అంతేగాక, ఈ కేసులో డీఎన్ఏ ఎక్స్పర్ట్స్ ఇంతవరకు విచారణకు హాజరురాలేదని, ఘటనాస్థలంలో గల సీసీటీవీ రికార్డులను కూడా పోలీసులు ఇంతవరకు కోర్టుకు సమర్పించలేదని చెప్పారు. ఈ క్రమంలో సరైన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ, అప్పటివరకు మోహన్‌సింగ్ ఉరిశిక్షపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. -
సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట
-
రాజస్తాన్ హైకోర్టులో ఆ పదాలు నిషేధం
జైపూర్: భారత న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం అమలవుతోన్న చాలా చట్టాలు బ్రిటీష్ పాలనా కాలంలో రూపుదిద్దుకున్నవే. దేశానికి స్వాతంత్ర్య వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటకీ కోర్టుల్లో ఇంకా పురాతన చట్టాలు, పాత నియమాలనే అనుసరిస్తున్నారు మన న్యాయకోవిధులు. అయితే వాటికి చరమగీతం పాడేందుకు రాజస్తాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయమూర్తులు కేసులను వాదించే సందర్భంలో ‘మై లార్డ్’, ‘యువర్ హానర్’ అనే పదాల వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్ భట్టు నేతృత్వంలో భేటీ అయిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కోర్టు కార్యాకలపాలలో వాటిని వాడకూడదంటూ హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ సతీష్ కుమార్ శర్మ నోటీసులు జారీ చేశారు. ఇదే పద్దతిని దేశ వ్యాప్తంగా గల హైకోర్టులో కూడా పాటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
వివాహితుడితో కలిసి ఉండేందుకు అనుమతిచ్చిన కోర్టు
జైపూర్ : రాజస్తాన్ హై కోర్టు సోమవారం సంచలన తీర్పిచ్చింది. వివాహితుడైన వ్యక్తిని ప్రేమించిన మహిళను అతనితోనే కలిసి జీవించవచ్చని పేర్కొంది. మొయినుద్దీన్ అబ్బాసి అనే వ్యక్తి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు సందీప్ మెహతా, వినిత్ కుమార్ మథూర్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. వివరాలు.. రూపాల్ సోనీ అనే మహిళ(26) మొయినుద్దీన్ అబ్బాసీ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. 2018, జూలై 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోనీని ఇంట్లో బంధించారు. దాంతో మొయినుద్దీన్ తన భార్యను చూపించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. విచారణలో భాగంగా గత ఏడాది మార్చి 13న పోలీసులు సోనీని కోర్టు ముందు హాజరుపర్చారు. అయితే విచారణలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొయినుద్దీన్‌కు ఇంతకు ముందే వివాహం జరిగిందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికి అతను సోనీని ఇంటర్ ఫెయిత్(నమ్మకం) వివాహం చేసుకున్నాడని.. తర్వాత దాన్ని రిజిస్టర్ చేయించాడని విచారణలో తెలీంది. ఆశ్యర్యపోయిన కోర్టు కేసుకున్న సున్నిత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సోనీని ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్రభుత్వ మహిళా సంక్షేమ కేంద్రానికి పంపించింది. అనంతరం కోర్టు సోనీకి ఆమె భవిష్యత్తు గురించి.. తర్వాత ఎదుర్కొబోయే పరిణామాల గురించి కౌన్సిలింగ్ ఇప్పించింది. ఆపై నిన్నటి విచారణలో భాగంగా కోర్టు సోనీ నిర్ణయం గురించి ప్రశ్నించింది. అందుకు ఆమె తన బంధాన్ని కొనసాగిస్తానని.. మొయినుద్దీన్‌తోనే కలిసి ఉంటానని కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు ‘సదరు మహిళ మేజర్, పూర్తి మానసిక పరిపక్వత కల్గిన వ్యక్తి, హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందువల్ల కోర్టు ఆమె నిర్ణయాన్ని గౌరవించి మొయినుద్దీన్‌తో కలిసి ఉండేందుకు అనుమతిస్తూ తీర్పునిస్తున్ను’ట్లు పేర్కొంది. -
'విదేశాలకు వెళ్లాలనుకుంటే హైకోర్టును అడగండి'
న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లడం తప్పనిసరి అయితే సల్మాన్ ఖాన్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. రాజస్తాన్ హైకోర్టు స్టే ఆర్డర్‌ను సవాల్ చేస్తూ రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును తిరిగి పరిశీలించాలని రాజస్తాన్ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. శిక్ష నిలుపుదల చేస్తే సల్మాన్‌కు ఎటువంటి నష్టం కలగదనే విషయాన్ని హైకోర్టులోనే చెప్పుకోవాలని అత్యున్నత న్యాయస్థానం రాజస్తాన్ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణజింకలను వేటాడినట్టు 1998లో సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసలు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ ..రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పుపై విధించింది. ఇప్పుడు అటుతిరిగి ఇటు తిరిగి మళ్లీ ఈ కేసు రాజస్తాన్ హైకోర్టు ముందుకు వచ్చింది. గతేడాది నవంబర్ ఐదున సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనలు ముగిశాయి. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ, జస్టిస్ ఏకే గోయెల్ ఈ కేసులో వాదనలు విన్నారు. -
సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
-
సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థాపం పక్కన పెట్టింది. సల్మాన్ ఖాన్ విదేశాలకు వెళ్లవచ్చని రాజస్తాన్ హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పునర్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రాజస్తాన్ హైకోర్టును ఆదేశించింది. కాగా ఈ కేసులో సల్మాన్‌కు విధించిన శిక్ష అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడింది. హైకోర్టు గత సంవత్సరం నవంబర్ 12న ఆ శిక్షపై స్టే విధించింది.