సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్ట్
బద్వేలు: రాజస్థాన్‌కు చెందిన సెల్‌ఫోన్ దొంగల ముఠాను వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.4 లక్షల విలువ చేసే 167 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీరు దొంగిలించిన సెల్ ఫోన్ ఈఎంఐ నెంబర్ ఆధారంగా మెదక్ జిల్లా నిజాంపేట గ్రామంలో ఉన్నట్టు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హజరుపరచనున్నారు.