ఎర్రకాలువలో పడి దుర్మరణం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం డ్యామ్‌పై నుంచి యువకుడు ఎర్రకాలువలో పడి ఆదివారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన ఎస్కే బాజీ (20) తన సోదరులు సుభానీ, మదీన్, బావమరిది నజీర్‌తో కలిసి ఆదివారం లక్కవరంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి మధ్యాహ్న సమయంలో ఈ నలుగురు కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్దకు చేరుకున్నారు. వీరంతా జలాశయం డ్యామ్‌పైకి ఎక్కారు. ఈ సమయంలో ఒక్కసారిగా నీళ్ల నుంచి శబ్దం రావడంతో జలాశయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. డ్యామ్ పైకి ఎక్కిన నలుగురిలో బాజీ కనిపించకపోవడంతో స్థానికులు లక్కవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చేపట్టి బాజీ మృతదేహాన్ని వెలికితీశారు. బాజీ ఎర్రకాలువలోకి దూకాడా లేదా ప్రమాదవశాత్తు జారీ పడ్డాడా అన్న అనుమానాలు ఉన్నాయి. బాజీ కాలుజారి పడ్డాడని ముగ్గురు యువకులు చెబుతున్నారు. దీనిపై లక్కవరం ఎస్ఐ శ్రీనివాసరావును వివరణ కోరగా బాజీ ఫో¯ŒS మాట్లాడుకుంటూ ప్రమాదవశాత్తు కాలు జారీ ఎర్రకాలువలోకి పడి మృతి చెందాడని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు బాజీ తాపీపని చేసుకుంటూ జీవిస్తుంటాడు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.