‘మీసేవ’లో ముందున్నాం..
న్యూస్‌లైన్: జిల్లాలో ‘మీసేవ’ పరిస్థితి ఏమిటి?
జేసీ: జిల్లాలో 270 కిపైగా మీసేవ సెంటర్లు ఉన్నాయి, వాటిలో ప్రస్తుతం 150రకాల సేవలు అందిస్తున్నాం. త్వరలోనే మరో 350 సేవలు రానున్నాయని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొత్తగా ఐదువేల జనాభా ఉండే గ్రామానికి ఒక మీ సేవ సెంటర్‌ను మంజూరుచేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి.
న్యూస్‌లైన్: అన్నింటికీ ఆధారంమైన ఆధార్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందనే ఆరోపణలకు మీ సమాధానం?
జేసీ: నిజమే కొన్ని ఏజెన్సీలు చేసిన నిర్లక్ష్యానికి ఇప్పటికీ జిల్లావాసుల్లో సగం మందిమాత్రమే ఆధార్‌కార్డు లు అందాయి. కానీ ఈ ప్రక్రియను వేగవంతం చేసేం దుకు ఇటీవల 32 శాశ్వత కేంద్రాలను ప్రారంభించాం. నగదు బదిలీ ఈనెలాఖరు నుంచి అమలుకానుంది.
న్యూస్‌లైన్: ఆధార్, వెబ్‌ల్యాండ్ ప్రక్రియలో ఏన్నో స్థానంలో ఉన్నాం..
జేసీ: ఈరెండు ప్రక్రియలు చాలా వెనకబడ్డాయి. ఈ కారణంగా ఆధార్ 14వ స్థానం, వెబ్‌ల్యాండ్ 28వస్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ఓటర్ డ్రైవ్‌లో అధికారులు ఉండటంతోనే ఈపరిస్థితి నెలకొంది. నెలరోజుల్లో మొదటిస్థానానికి తీసుకొస్తాం.
న్యూస్‌లైన్: జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మీ తీసుకుంటున్న చర్యలు?
జేసీ: జిల్లాలో 600 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించాం, వీటిని రక్షించేందుకు రూ.70లక్షలతో కం చెలను ఏర్పాటుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కంచెల పూర్తిప్రక్రియకు మరో రూ.1.50కో ట్లు అవసరమని ఇటీవల సీసీఎల్ఏకు నివేదించాం..
న్యూస్‌లైన్: జిల్లాలో ప్రాజెక్టుల కింద పునరావాసం పురోగతి ఏమిటి?
జేసీ: జిల్లాలోని నెట్టెంపాడు, రాజీవ్ భీమా, ఎంజీఎల్ ఐ కింద 12 పునరావాస కేంద్రాలు ఉన్నాయి. బాధితులకు అన్ని వసతులు కల్పించాం. అలాగే పీజేపీ, నె ట్టెంపాడు ప్రాజెక్టు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అప్పట్లో పరిహారం చెల్లించింది. కానీ రికార్డుల్లో అమలుకాలేదు. దీనిపై ప్రత్యేకదృష్టి సారించి 21వేల ఎకరాల భూములను రికార్డుల్లో అమలుచేసి 20 ఏళ్ల సమస్యను తీర్చగలిగాం.
న్యూస్‌లైన్: జిల్లాలో అమ్మహస్తం పథకం లోపభూయిష్టంగా మారిందనే ఫిర్యాదులపై మీరేమంటారు?
జేసీ: అమ్మహస్తం ఇంతవరకు పంపిణీ చేసిన వాటిలో మన జిల్లానే ముందుంది. ఇక తొమ్మిది సరుకుల విషయానికొస్తే, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు కాదనలేం. పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక ఈ ఏడాది 70వేల ఏఏవై కార్డులిచ్చిన ఘనత మన జిల్లాకే దక్కింది.
న్యూస్‌లైన్: రెండేళ్లలో జేసీగా మీ అనుభూతి..
అభిప్రాయం
జేసీ: ఇంతకుముందు ఇదే జిల్లాలో నాగర్‌కర్నూల్ ఆర్డీఓగా పనిచేశాను. మళ్లీ ఇదే జిల్లాకు జేసీగా వచ్చాను. కలెక్టర్లు అందించిన సహకారంతోపాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది జిల్లా ప్రజల సహకారంతో రెండేళ్ల పాలన రెండు రోజుల్లా ముగిసింది. ఈ ఏడాదిలో కూడా జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందిస్తాను.