Rajendra itala
-
తడిసిన ధాన్యం 1.16 లక్షల టన్నులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా 1.16 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. దీనిపై జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా తడిసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియ చేపట్టింది. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అకాల వర్షాలకు తడిసిన ధాన్యం తరలింపుపై శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. అలాగే సంబంధిత అధికారులు, రాష్ట్ర రైస్ మిల్లర్లతో పౌర సరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ సమావేశమయ్యారు. ప్రత్యేక అధికారుల నియామకం.. ప్రాథమిక అంచనా ప్రకారం మంచిర్యాల, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల వద్ద సుమారు 1.16 లక్షల టన్నుల ధాన్యం తడిసిందని.. ఆ ధాన్యాన్ని తక్షణం రైస్ మిల్లులకు తరలించాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తరలింపు, గన్నీ బ్యాగులు, రవాణా తదితర అంశాలను పర్యవేక్షించడానికి పాతజిల్లాల ప్రకారం సీనియర్ డీసీఎస్‌వోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వారితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి.. తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సూచనలు చేశారు. వరి, మామిడికి తీవ్ర నష్టం 38,417 ఎకరాల్లో ఇంకా కోత దశలోనే ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ తెలిపారు. 430 ఎకరాల్లో మొక్కజొన్న, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. ఇక 52,500 ఎకరాల్లో మామిడి, నిమ్మ, బొప్పాయి, అరటి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యాన శాఖ అంచనా వేసింది. అందులో 42,500 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్టు పేర్కొంది. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు రూ.38 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేసినట్టు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధు తెలిపారు. ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ (ప్రొక్యూర్మెంట్) ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల కోసం పౌర సరఫరాల శాఖ వాట్సాప్ నంబర్ 7330774444ను ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా స్థాయిలోనూ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన సమాచారం, కనీస మద్దతు ధర, కొనుగోళ్లు తదితర సమాచారాన్ని రిజిస్టర్లో రికార్డు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, ఆర్టీఏ అధికారులతో సమన్వయం చేసుకుని కొనుగోలు కేంద్రాల నుంచి తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. తక్షణ చర్యలుగా కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని దగ్గరలోని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి, వెంటనే బాయిలర్‌లో డంప్ చేసి మరింత పాడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల పౌర సరఫరాలు, ఎఫ్íసీఐ అధికారులతో పాటు స్థానిక జిల్లా రైస్ మిల్లర్లతో కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి ధాన్యం త్వరితగతిన అన్లోడ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
కరెన్సీ కొరత ఉంది
• అంగీకరించిన ఎస్ఎల్బీసీ చైర్మన్ శంతను ముఖర్జీ • నోట్ల రద్దు కారణంగా ఎన్నో అవస్థలు • వినియోగదారులను సంతృప్తిపరచలేక పోతున్నాం • ఆసరా పింఛన్లు పంపిణీ చేయలేని పరిస్థితి • చిన్న నోట్లు లేక ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్య • రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నోట్లు పంపాలని ఆర్బీఐకి ఈటల విజ్ఞప్తి • రైతులను కాల్చుకు తింటున్నారంటూ బ్యాంకర్లపై పోచారం ఆగ్రహం • వాడివేడిగా రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల సమావేశం సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నేపథ్యంలో గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల (ఎస్ఎల్బీసీ) సమావేశం వాడివేడిగా సాగింది. నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారని మంత్రులు, అధికారులు మండిపడ్డారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా రైతులను కాల్చుకు తింటున్నాయంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో తొలుత ఎస్బీహెచ్ ఎండీ, ఎస్ఎల్బీసీ చైర్మన్ శంతను ముఖర్జీ మాట్లాడారు. ‘‘నోట్ల రద్దుతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. కానీ నగదు అవసరమైనంత లేకపోవడంతో వినియోగదారులను సంతృప్తి పరచలేకపోతున్నాం. ఆసరా పింఛన్‌దారులకు రూ. వెరుు్య చొప్పున ఇవ్వాల్సి ఉంది. కానీ చిన్న నోట్లు అందుబాటులో లేవు. పోస్టాఫీసుల్లో ఇదో సమస్యగా మారింది..’’అని ఆయన పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ వ్యవస్థలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. కొత్త జిల్లాల నేపథ్యంలో వాటికి లీడ్ బ్యాంక్ మేనేజర్లను గుర్తించామన్నారు. రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు: మంత్రి పోచారం ఈ ఏడాది ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకులు కేవలం 22.5 లక్షల మందికే ఇచ్చాయని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రూ.లక్షలోపు రుణాలు తీసుకునే రైతుల నుంచి వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా.. చాలా బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ వసూలు చేశాయన్నారు. ఎంతో కొంత మెరుగ్గా ఆంధ్రా బ్యాంకు రైతులకు రుణాలు ఇచ్చిందని, సిండికేట్ బ్యాంకు మాత్రం దారుణంగా వ్యవహరించిందని విమర్శించారు. సిండికేట్ బ్యాంకువారు తెలంగాణలో ఉన్నామనుకుంటున్నారా, మరెక్కడో ఉన్నామనుకుంటున్నారా అని నిలదీశారు. బ్యాంకుల తీరుతో అనేకమంది రైతులు భయపడి ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకర్లు సహకరించబోమంటే మిగతా రుణమాఫీ సొమ్మును నేరుగా రైతులకే ఇస్తామన్నారు. మూడో వారుుదాలో భాగంగా రూ.2,020 కోట్లు బ్యాంకులకు ఇచ్చినా.. కొన్ని బ్యాంకులు ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. బ్యాంకులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయని, ఇది దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. 5 వేల కోట్ల చిన్న నోట్లు ఇవ్వండి: ఈటల దేశంలో 86 శాతం కరెన్సీ రూ.500, రూ.వెరుు్య నోట్లేనని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదుతోనే లావాదేవీలన్నీ జరుగుతాయని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కూలీలకు నగదు లేక లావాదేవీలన్నీ నిలిచిపోయాయని.. అడ్డాకూలీల బతుకు ఛిద్రమైందని చెప్పారు. నగదు లేకపోవడంతో కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ. 2 వేల నోటు చలామణీ కావాలంటే కొత్త రూ.500, రూ.100 నోట్లు అవసరమని స్పష్టం చేశారు. వారుుదాల ప్రకారం అరుునా సరే రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల విలువైన రూ.500, రూ.100 నోట్లు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రస్తుతం విడుదల చేసిన సొమ్ము టిఫిన్ ఖర్చులకు కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని... డబ్బులు విడుదల చేసినా వారి చేతికి నగదు చేరలేదన్నారు. ఇక ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేసిందని, అర్హులకే అది అందేలా జాగ్రత్త పడాలని బ్యాంకర్లకు సూచించారు. నోట్ల రద్దుతో నష్టపోరుున పరిశ్రమలు, వ్యా పారులకు ప్రయోజనాలు కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు మూడు రోజుల్లో నగదు సరఫరా: ఆర్ఎన్ దాస్ నోట్ల రద్దు పరిణామాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని.. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి నగదు అందుతుందని రిజర్వుబ్యాంకు ప్రాంతీయ డెరైక్టర్ ఆర్ఎన్ దాస్ చెప్పారు. అరుుతే రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలకు మారాల్సిన ప్రాముఖ్యత ఉందని... డిజిటల్, ఎలక్ట్రానిక్ నగదు రహిత వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నగదు రహిత డిజిటల్ ఎకానమీ వైపు ప్రజలు మరలేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సూచించారు.