రాజేంద్రనగర్ కోర్టులో ఉద్రిక్తత
- న్యాయమూర్తులను అడ్డుకున్న న్యాయవాదులు
రాజేంద్రనగర్(రంగారెడ్డి జిల్లా)
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి 8వ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన తీవ్రతరమైంది. సోమవారం ఉదయం న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లకుండా న్యాయవాదులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు, న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల పహారాలో మేజిస్ట్రేట్ కోర్టులోకి వెళఅలారు. న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది.