టీడీపీ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు నమోదు
విశాఖ : టీటీపీ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై భూ కబ్జా కేసు నమోదైంది. తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఎమ్మెల్యేపై రాజేష్‌బాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పెందుర్తికి చెందిన రాజేష్‌బాబు ఒమెన్‌లో ఉంటున్నాడు. అతనికి స్వగ్రామంలో ఇల్లు, ఖాళీ స్థలం ఉంది. అయితే ఎమ్మెల్యే, అతని అనుచరులు తన ఇంటి కాంపౌండ్ వాల్‌ను కూల్చేసి... స్థలాన్ని కబ్జా చేశారని రాజేష్‌బాబు ఒమెన్ నుంచి ఈ మెయిల్ ద్వారా విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై భూ కబ్జా కేసు పెట్టారు. సమగ్ర దర్యాప్తు చేసి నిజనిజాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు. గతంలోనూ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు ఉన్నాయి.