Rajesh Sharma
-
OTT: ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టర్ అండ్ మిసెస్ మహినటీనటులు: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులుదర్శకత్వం: శరణ్ శర్మ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామిఎడిటింగ్: నితిన్ బైదిఓటిటి వేదిక: నెట్ ఫ్లిక్స్స్ఫూర్తి అన్నది ఎక్కడి నుండైనా రావచ్చు. ఆ స్ఫూర్తికి సిద్దాంతం, వేదాంతం ఉండవు. తాను ఆడలేని పరిస్థితులలో తన ఆటను వేరొకరిలో చూసుకుని ఆడిస్తే అదే నిజమైన స్ఫూర్తి. అ కోవకు చెందినే ఈ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహీ. కథ మూలం వర్ధమాన ఆటగాడు మహేంద్రసింగ్ థోనీ అని చెప్తున్నా ఈ సినిమాలో ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. కాని సినిమా పేరు తో పాటు ధోనీ పుట్టిన రాష్ట్రంలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఒక విధంగా ఇదొక మామూలు కథ. క్రికెట్ ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డ కథానాయకుడు ఓ సంఘటన వల్ల అదే క్రికెట్ కి దూరమవుతాడు. తాను దూరం చేసుకుంది ఎలాగైనా సాధించాలన్న సదుద్దేశంతో తన భార్యకు క్రికెట్ కోచ్ గా మారతాడు. ఆట అంటే వచ్చే ఆనందం కన్నా ఆడే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్ళు ఎన్నో ఎన్నెన్నో. అది కూడా మగవాళ్ళైతే కొంత వరకు పరవాలేదు. కాని ఆడవాళ్ళు ఎదుర్కొనే కష్టాలు అంతా ఇంతా కాదు. మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాలో ఈ పాయింట్ చాలా హృద్యంగా చూపించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఆఖర్లో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం వరకు ప్రేక్షకుడిని కట్టిబడేసేలా రాసుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు శరణ్ శర్మ. ముఖ్య తారాగణంలో నటించిన రాజ్ కుమార్ రావ్ మరియు జాహ్నవి కపూర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. వర్త్ టు వాచ్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ.- ఇంటూరు హరికృష్ణ -
ఆ కారణం వల్లే ఇండస్ట్రీని వదిలేసి రైతుగా మారాను: నటుడు
బుల్లితెర నటుడు రాజేశ్ శర్మ రైతుగా మారాడు. మంచి అవకాశాలు రాకపోవడం వల్లే నటనకు గుడ్‌బై చెప్పి కర్షకుడిగా మారానంటున్నాడు. మొదట ఇతడి నిర్ణయం విని ఊరికే అంటున్నాడేమో అనుకున్నారు, కానీ నిజంగానే రైతుగా మారి పొలం పండిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '2017లో నేను యాక్టింగ్ మానేద్దామనుకున్నాను. అప్పుడే మా నాన్నకు చెప్పాను. వారసత్వంగా వస్తున్న పొలం ఉంది కదా.. నేను పంట పండిస్తా అన్నాను. తను నా మాట పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేను అనుకున్నది చేసి చూపించాను. ప్రకృతి నాతో చెలగాటం ఆడింది రైతుగా మారడానికి ప్రధాన కారణం.. నటుడిగా నాకు మంచి అవకాశాలు రాలేదు, కెరీర్లో ఎదుగుదల లేకుండా పోయింది. అదే రైతుగా మారితే.. నాకు నచ్చినవి పండించొచ్చు, నచ్చిన ప్రయోగాలు చేయవచ్చు. అందుకే పొలంలో దిగాను. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రకృతి నాతో ఎన్నోసార్లు ఆడుకుంది. 20 ఎకరాల పొలంలో 15 వేల మొక్కలు నాటితే వరదల్లో కొట్టుకుపోయాయి. నాలుగేళ్ల తర్వాత కూడా మళ్లీ అలాంటి నష్టమే జరిగింది. ఆర్థికంగా చాలా నష్టపోయాను. దివాలా తీశా లాక్డౌన్లో నేను దాచుకున్న సేవింగ్స్ అంతా ఖర్చయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దివాలా తీశాను. అప్పులు ఎక్కువవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో నేను ఎంతో నేర్చుకున్నాను. నా పిల్లలు నన్ను రైతుగా మారిన నటుడు అని చెప్తుంటే గర్వంగా అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా రాజేశ్ శర్మ.. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ అనే సీరియల్లో నటించాడు. ఇది 2004-2006 మధ్య కొనసాగిన ఈ సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది. 2017లో దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఆ సమయంలో గత సీరియల్ నటీనటులంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. చదవండి: హీరోయిన్గా బోర్ కొట్టిందంటున్న బ్యూటీ.. ఇకపై మరో టాలెంట్ చూపిస్తుందట! -
పైన రైలు.. కింద రైమ్‌లు
ఫుట్‌పాత్‌ల మీద సంతలు! సంతల్లో బడి! బడిలో పంచాయతీలు! పంచాయతీల్లో ప్రాథమిక ఆసుపత్రులు! ఇదీ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా! అద్భుతమైన, నమ్మశక్యం కాని భారతదేశం. వ్యంగ్యంగానే అనిపించి ఉండొచ్చు మీకిది. అయితే రాజేష్ శర్మ లాంటి వాళ్లు నిజంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా అనిపించేలా చేస్తున్నారు. రాజేష్ శర్మ ఢిల్లీలో ఉంటాడు. ఆ మహానగరంలోని వలస జనాభాకు మెట్రో బ్రిడ్జీల కింది ప్రదేశాలు కూడా నివాసాలే. అలా మెట్రో పిల్లర్స్ కింద వీధుల్లో ఉంటున్న పిల్లలను అప్పుడప్పుడూ పలకరిస్తూ వాళ్లకు చాక్లెట్లో, బట్టలో కొనిస్తూ ఉండేవాడు రాజేష్. అతనెప్పుడు వెళ్లినా ఆ పిల్లలంతా చదువూసంధ్య లేక ఆడుకుంటూ, గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కనిపించేవారు. ఆ పిల్లల కోసం ఏదో తెస్తున్నాడు. ‘అయితే అది కరెక్ట్ కాదేమో! ఆ పిల్లల జీవితాలకు ఉపయోగపడేది ఏదైనా చేయాలి. అది కరెక్ట్’ అనుకున్నాడు. ఒకరోజు వెళ్లి వాళ్ల రోజూవారీ కార్యక్రమాల గురించి ఆరా తీశాడు ఆ పిల్లల దగ్గరే. చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. తల్లిదండ్రులకు పని ఉన్న రోజు వాళ్లకు తిండి దొరుకుతుంది.. లేదంటే పస్తులే. అవసరమనుకుంటే ఆ పిల్లలూ చిన్నాచితకా పనులకు వెళ్లి చిల్లర తేవాల్సిందే. అది తెలిసి ఆయనకు బాధ కలిగించింది. ఆ పిల్లలకు చదువు లేదు. చదువు చెబితే జీవితం చక్కబడుతుంది అనిపించింది. ఆ పిల్లల్లో పెద్దగా ఆసక్తి కనపడలేదు. అయినా తెల్లవారి నుంచే తన ప్రయత్నం మొదలుపెట్టాడు. ఊడ్చుకుని.. తుడ్చుకుని ఉద్యోగం అయిపోగానే సాయంత్రం సరాసరి ఆ పిల్లలుండే మెట్రో రైల్వే బ్రిడ్జికిందికి వచ్చాడు రాజేశ్. అతను రాగానే పిల్లలందరూ మూగారు.. చాక్లెట్లు, బట్టలకోసం. ఇచ్చాడు. తీసుకొని వెళ్లిపోయారు. అయినా అతను అక్కడే ఉండి.. ఓ చోటు చూసి.. దాన్ని ఊడ్చి, తుడిచి శుభ్రం చేశాడు. రైమ్స్ చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లలంతా తమాషా చూస్తున్నట్టుగా నవ్వసాగారు. గేలి చేశారు. పట్టించుకోకుండా ఓ గంట అలాగే ఇంగ్లిష్, హిందీ పద్యాలు చెప్పి వెళ్లిపోయాడు. రెండో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. వారం రోజులకు ఆ పిల్లల్లో ఒకరిద్దరు అమ్మాయిలు వచ్చి బుద్ధిగా కూర్చుని ఆయన చెప్పేది వినడం మొదలుపెట్టారు. తెల్లవారికి ఇంకొంతమంది పిల్లలు చేరారు. రాజేష్‌లో ఉత్సాహం పెరిగింది. ఇంకో వారం గడిచేసరికి ఆ బ్రిడ్జి కిందున్న పిల్లలంతా చేరారు. పుస్తకాలు, నోట్‌బుక్స్ తెచ్చాడు. పెన్సిళ్లు, పెన్నులు, పలకలు, బలపాలూ ఇచ్చాడు. సీరియస్‌గానే చదువు సాగింది. రైల్వే బోర్డ్.. బ్లాక్ బోర్డ్ రాజేష్ చేస్తున్న పని ఢిల్లీ మెట్రో రైల్వే సిబ్బంది దృష్టికీ వచ్చింది. ముచ్చట పడి.. ఆ బ్రిడ్జి కింద బ్లాక్‌బోర్డ్‌ను అమర్చింది. ఆ సహాయంతో రాజేష్ తన ఇతర స్నేహితులనూ కలుపుకొని లెక్కలు, సైన్స్‌కూడా బోధిస్తున్నాడిప్పుడు. అంతేకాదు.. ఢిల్లీలోని యువతకూ సందేశమిచ్చాడు.. తమ ఖాళీ సమయాల్లో తమకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని మెట్రో బ్రిడ్జీల కింద వీధి బాలలకు చదువు చెప్పాలని. మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ఇది ఓ ఉద్యమంలా మొదలైంది. ‘‘నా ఈ చిన్న ప్రయత్నం ఇంత మంచి కార్యక్రమంగా మారుతుందని కలలలో కూడా ఊహించలేదు. మెట్రో వాళ్లు ఆబ్జెక్షన్ చెప్తారేమోనని చాలా కాలం భయంభయంగానే.. క్లాసులు చెప్పా. కాని బ్లాక్‌బోర్డ్ పెట్టి వాళ్లు నన్ను ప్రోత్సహించారు. థ్యాంక్స్ టు ఢిల్లీ మెట్రో’’ అంటూ కృతజ్ఞతలు చెప్తాడు రాజేష్ శర్మ. ఆయన్నుంచి మనం నేర్చుకోవలసింది నేర్చుకుంటే, మనం నేర్పవలసింది నేర్పుతాం. – శరాది -
హిందీ నుంచి తెలుగులోకి...
శిల్ప శుక్లా, షాదాబ్ కమల్, దివ్యేంద్ర భట్టాచార్య, రాజేశ్ శర్మ ప్రధాన పాత్రధారులుగా... అజయ్ చెహల్ దర్శకత్వంలో హిందీలో రూపొందిన సినిమా ‘బి.ఏ. పాస్’. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు ఎం. అచ్చిబాబు. హైదరాబాద్‌లో అనువాద కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ నటుడు చలపతిరావు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. నిర్మాతకు అభినందనలందించారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వీఎస్పీ తెన్నేటి, సంగీతం: అలోక్నంద్దాస్ గుప్తా, నిర్వహణ: డి.నారాయణ, సమర్పణ: సంపత్‌కుమార్. -
బి.ఎ.పాస్ మూవీ స్టిల్స్