టైటిల్: మిస్టర్ అండ్ మిసెస్ మహి
నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులు
దర్శకత్వం: శరణ్ శర్మ
సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి
ఎడిటింగ్: నితిన్ బైది
ఓటిటి వేదిక: నెట్ ఫ్లిక్స్
స్ఫూర్తి అన్నది ఎక్కడి నుండైనా రావచ్చు. ఆ స్ఫూర్తికి సిద్దాంతం, వేదాంతం ఉండవు. తాను ఆడలేని పరిస్థితులలో తన ఆటను వేరొకరిలో చూసుకుని ఆడిస్తే అదే నిజమైన స్ఫూర్తి. అ కోవకు చెందినే ఈ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహీ. కథ మూలం వర్ధమాన ఆటగాడు మహేంద్రసింగ్ థోనీ అని చెప్తున్నా ఈ సినిమాలో ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. కాని సినిమా పేరు తో పాటు ధోనీ పుట్టిన రాష్ట్రంలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం.
ఒక విధంగా ఇదొక మామూలు కథ. క్రికెట్ ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డ కథానాయకుడు ఓ సంఘటన వల్ల అదే క్రికెట్ కి దూరమవుతాడు. తాను దూరం చేసుకుంది ఎలాగైనా సాధించాలన్న సదుద్దేశంతో తన భార్యకు క్రికెట్ కోచ్ గా మారతాడు. ఆట అంటే వచ్చే ఆనందం కన్నా ఆడే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్ళు ఎన్నో ఎన్నెన్నో. అది కూడా మగవాళ్ళైతే కొంత వరకు పరవాలేదు. కాని ఆడవాళ్ళు ఎదుర్కొనే కష్టాలు అంతా ఇంతా కాదు.
మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాలో ఈ పాయింట్ చాలా హృద్యంగా చూపించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఆఖర్లో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం వరకు ప్రేక్షకుడిని కట్టిబడేసేలా రాసుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు శరణ్ శర్మ. ముఖ్య తారాగణంలో నటించిన రాజ్ కుమార్ రావ్ మరియు జాహ్నవి కపూర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. వర్త్ టు వాచ్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ.
- ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment