మాదకద్రవ్యాలను చట్టబద్ధం చేస్తా...
పంజాబ్లో మాదకద్రవ్యాల బెడద ఈసారి ఎన్నికల ప్రచారాంశంగా మారింది. వివిధ పార్టీల అభ్యర్థులందరూ మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ఏమేం చేస్తామో చెబుతుంటే, రాజీవ్ కల్రా అనే ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం తనను గెలిపిస్తే, మాదకద్రవ్యాలకు చట్టబద్ధత కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. లూధియానా లోక్సభ స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కల్రా, తనను గెలిపిస్తే, ప్రభుత్వ అనుమతులు గల నల్లమందు దుకాణాలను తెరిపించేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. అలాగని తాను మాదకద్రవ్యాలను సమర్థించడం లేదని, ఇప్పటికే వాటికి బానిసలైన వారికి వాటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నానని అన్నారు.