విజయవాడ చేరిన రాజీవ్ సద్భావన యాత్ర
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశంలో సాంకేతిక పురోభివృద్ధికి బాటలు వేశారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. తమిళనాడులోని శ్రీపెరందూర్ నుంచి ఢిల్లీ వరకు సాగుతున్న రాజీవ్‌గాంధీ స్మారక సద్భావన యాత్ర బుధవారం విజయవాడ నగరానికి చేరగా కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రఘువీరా మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం తుదిశ్వాస విడిచే వరకు రాజీవ్‌గాంధీ కృషి చేశారన్నారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన ఆయన యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఎనిమిది బస్సుల్లో 150 మంది పార్టీ కార్యకర్తలతో సద్భావన యాత్ర సాగుతోందన్నారు. యాత్ర నిర్వాహకుడు ఎస్.ఎస్.ప్రకాశంను రఘువీరారెడ్డి సన్మానించారు. రాజీవ్జ్యోతికి ఏపీసీసీ కాంగ్రెస్ జెండాతో వీడ్కోలు పలికారు. శాసనమండలి విపక్షనేత సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, ఆపార్టీ నాయకులు సుంకర పద్మశ్రీ, టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్, మీసాల రాజేశ్వరరావు, రాజీవ్త్రన్ పాల్గొన్నారు.