‘రాజుగారి దొంగలు’ వచ్చేస్తున్నారు
లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ నెల 21న మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు ప్రేక్షకులందరు ఆదరించాలని అన్నారు.