నూతన అధ్యాయం
ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
బూత్ స్థాయిలో కమిటీల ఏర్పాటు
మండల, జిల్లా కమిటీలకే పూర్తి అధికారం
డిసెంబర్ 2 నుంచి మండలాల్లో నేతల బస
ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు
వరంగల్ : వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోందని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేసినకార్యకర్తలు, నేతలకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలను పురస్కరించుకుని హన్మకొండలోని డీసీసీ భవన్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోని నేతలు, కార్యకర్తలతో సోమవారం సన్నాహక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జిలు, నేత లు, మండల, బ్లాక్, ఎంపీపీ. జెడ్పీటీసీ, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యుల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు సేకరించారు.
అనంతరం కొప్పుల రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసే విధానానికి స్వస్తి చెబుతోందన్నారు. మండల, జిల్లా కమిటీలకు పూర్తి బాధ్యతలు, అధికారాలు ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందన్నారు. మండల, జిల్లా కమిటీల నిర్ణయాల మేరకు అభ్యర్థులను ఎంపిక చేసే నూతన విధానం వరంగల్ ఉప ఎన్నికల నుంచి ప్రారంభమవుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే అన్ని స్థాయి నుంచి అభిప్రాయూలు సేకరించేందుకు ఈ సమావేశం నిర్వహిం చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని స్థారుుల నాయకులు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో బూత్‌ల వారీగా కమిటీలను నియమించి ఆ పరిధిలోని ఓటర్లను వారికి కేటారుుంచాలని సూచించారు. ఆయూ కమిటీల నాయకులు రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోది ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీల అమలును ప్రజలకు వారికి అర్థమయ్యేలా విశదీకరించాలన్నారు.
మండలానికో ఇన్చార్జి
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ చర్యలు తీసుకుంటోందని, డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రతీ మండలానికి ఇన్చార్జిగా నియమించనున్న రాష్ట్ర స్థారుు నేతలు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అదే మండలంలో బస చేస్తారని రాజు తెలిపారు. ఆయూ నేతలు మండలంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు అయ్యాయో, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన విషయాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ఇదంతా సాఫీగా సాగేలా అందరికీ ఆమోదమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు క్షేత్ర స్థాయిలో అభిప్రాయలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
అందరి ఆమోదంతోనే...
అందరికి ఆమోదమైన అభ్యర్థిని ఉప ఎన్నికల్లో పోటీ చేయించేందుకే పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకే ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు పీసీసీ నాయకులు వెల్లడించారు. సన్నాహక సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, రైతుల ఆత్మహత్యలు, నిత్యావసర వస్తువుల ధరలు నింగినెకి ్కన విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని శ్రేణులకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతో సీఎం కేసీఆర్, ప్రధానీ మోదీలకు గుణపాఠం చెప్పినట్లవుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నగర పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, పీసీసీ నాయకులు బండా ప్రకాష్, ఈవీ.శ్రీనివాస్, బట్టి శ్రీను, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోశాల పద్మ, నేతలు నమిండ్ల శ్రీనివాస్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్నతో పాటు యువజన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
మాట్లాడనివ్వలేదని ఫిర్యాదు
సన్నాహక సమావేశంలో తమ వర్గీయులను ఎందుకు మాట్లాడనివ్వకపోవడంపై నియోజకవర్గ ఇంచార్జ్ దుగ్యాల శ్రీనివాస్‌రావు సాయంత్రం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అలాగే, అక్కడే ఉన్న డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వర్గీయులు సైతం దుగ్యాల శ్రీనివాసరావు నియోజకవర్గ పార్టీని, నాయకులను పట్టించుకోవడం లేదన్న విషయాలను ఉత్తమ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి తోడుగా ఉదయం మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో ఆయన వర్గీయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటన్నింటినీ పరిశీలిస్తే ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం వచ్చే అవకాశం తక్కువేననే గుసగుసలు వినిపించారుు.