దొంగలను పట్టించిన సీసీ కెమెరా
అనంతపురం సెంట్రల్ : కారులో ఉంచిన పర్సును చాకచక్యంగా కొట్టేశారు. అయితే మూడోకంటి (సీసీకెమెరా)కి చిక్కి కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే..గత నెల 28న జరిగిన ఓ చోరీ ఘటనలో నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం వారి వివరాలను సీఐ శుభకుమార్ వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన రాజులాల్, రతన్లాలు ఉపాధి నిమిత్తం అనంతపురం వచ్చి తోపుడుబండ్లపై పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే వచ్చే కొద్దిపాటి డబ్బు సరిపోకపోవడంతో చోరీలు చేయడం ప్రవృత్తిగా మలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే గతనెల 28న ఓ ఉపాధ్యాయురాలు తన కారును రోడ్డు పక్కగా నిలిపి ఓ దుకాణంలోకి Ðð ళ్లి తిరిగి వచ్చే సరికి, కారులో ఉండాల్సిన ఆమె పర్సు మయమైంది. దీనిపై బాధితురాలు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అనంతరం దొంగలను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 35 వేలు రికవరీ చేశారు.