రాజ్యసభ ఎన్నికల బరిలో వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంనుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీచేయాలని పీసీసీ నిర్ణయించింది. సిట్టింగ్ సభ్యుడైన వి.హన్మంతరావునే పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి అనుగుణంగానే ఏఐసీసీకి, పీసీసీ నివేదికను కూడా పంపింది. వి.హన్మంతరావు, ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన గుండు సుధారాణి పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే ఈ రెండుస్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయినా గెలుపోటములకు సంబంధం లేకుండా పోటీకి దిగాలని పీసీసీ భావిస్తోంది.