Rakasa Movie
-
బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?
ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బైకర్', 'రాకాస' అనే తెలుగు సినిమాలు వచ్చాయి. రెండింటికి సూపర్ రెస్పాన్స్ రానప్పటికీ పర్లేదు చూడొచ్చనే టాక్ అయితే వచ్చింది. ఒకటి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కాగా, మరొకటి హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ రెండింటి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి? ప్రస్తుతం వీటి పరిస్థితి ఏంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'రాకాస' విషయానికొస్తే.. మెగాడాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించగా, సంగీత్ శోభన్-నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. మానస శర్మ అనే మహిళా దర్శకురాలు ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. రిలీజ్ శుక్రవారమే అయినప్పటికీ ముందురోజు రాత్రి ప్రీమియర్లు వేశారు. వాటితో కలిపి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ కావొచ్చేమో అనిపిస్తుంది.'బైకర్' విషయానికొస్తే.. శర్వానంద్ హీరోగా నటించిన మోటో రేసింగ్ డ్రామా మూవీ ఇది. ఒకప్పటి హీరో రాజశేఖర్ ఇందులో కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యువీ క్రియేషన్స్ నిర్మించింది. రేసింగ్ సీన్స్ బాగున్నప్పటికీ ఎమోషన్స్ అనుకున్నంత వర్కౌట్ కాలేదని టాక్ అయితే వచ్చింది. దీని తొలిరోజు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్లతో కలిసి మొదటిరోజు రూ.2.41 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. చూస్తుంటే ఈ రెండు చిత్రాలతో బాక్సాఫీస్ కాస్త ఊపిరి పీల్చుకునేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత మెగా డాటర్ నిహారిక నిర్మించిన రెండో చిత్రం రాకస. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్స్..మరే చిత్రానికి చేయలేదు. మెగా హీరోలు కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్, టీజర్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నిర్మాతగా నిహారిక ఖాతాలో రెండో విజయం పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరు(సంగీత్ శోభన్).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్‌పోర్ట్‌ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్‌పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నటీనటులు, కథను పట్టించుకోరు. భయపెడుతూ నవ్విస్తే చాలు.. ఆ సినిమాను ఆదరిస్తారు. రాకస టీమ్ కూడా అదే పని చేసింది. చిన్నప్పుడు చదువుకున్న బకాసురుడి కథను స్ఫూర్తిగా తీసుకొని దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే హారర్ కంటే ఎక్కువగా కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. అది బాగానే వర్కౌట్ అయింది కూడా. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసే సన్నివేశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను తీర్చిదిద్దారు.పాడుబడ్డ కోట..ఆ కోటకు వెయ్యేళ్ల చరిత్ర.. బ్రహ్మరాక్షసుడి కండీషన్..ఇలా సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడైతే హీరో ఎంట్రీ ఇస్తాడో కథనం కామెడీ వైపు టర్న్ తీసుకుంటుంది. ప్రియురాలి కోసం అమెరికా నుంచి రావడం..అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. ఊరి పెద్దల తీర్పుతో పాస్‌పోర్టు కోల్పోవడం..ఇందంతా కామెడీగా సాగిపోతాయి. అయితే ఈ తరహా పంచ్‌లు, కామెడీ సీన్లు చాలా సినిమాల్లో చూడడంతో ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోదు. అసలు కథను ప్రారంభించడానికి ఇదంతా సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. హీరో ఎప్పుడైతే కోటలోకి ప్రవేశిస్తాడో.. అప్పటి నుంచి కథనం పరుగులు పెడుతూ.. నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మరాక్షసుడి సీన్ భయపడితే..దెయ్యాల సీన్ నవ్వులు పూయిస్తుంది. ఇక గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, నయన్ సారిక కూడా కోటలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నవ్వులు డబుల్ అవుతాయి. అదే సమయంలో బ్రహ్మరాక్షసుడి నుంచి ఈ గ్యాంగ్ ఎలా తప్పించుకుంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అయితే సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. ఈ రోజుల్లు దెయ్యాలు, రాక్షసులు ఉంటాయా? అని లాజిక్కులు వెతక్కుండా సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. సంగీత్ శోభన్ మంచి నటుడు. ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమైపోతాడు. వీరూ పాత్రలో కూడా ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నయన్ సారిక తెరపై అందంగా కనిపించింది. వీరిద్దరి లవ్‌ట్రాక్ అంతగా పండలేదు కానీ.. బోర్ మాత్రం కొట్టించదు. గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. కోటలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టాలి. ఈ విషయంలో సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్ విజువల్స్ బాగుతున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిహారిక ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. గ్రాండ్ లెవల్ లో సినిమాను నిర్మించారు. -
ఎవరీ మానస శర్మ? అచ్చం ఓయ్ హీరోయిన్లా ఉందే!
గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం తనే ఉంది. చూడటానికి అమాయకంగా, సాంప్రదాయంగా కనిపిస్తూ తెగ వైరలవుతోంది. ఆ తను మరెవరో కాదు రాకాస దర్శకురాలు మానస శర్మ. చూడటానికి ఓయ్ సినిమా హీరోయిన్ షామిలికి చెల్లెలిగా కనిపిస్తున్న ఈవిడ గురించి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. కాబట్టి ఆమె ఎవరు? ఇంతకు ముందు ఏం చేసింది? అనేది ఓసారి చూసేద్దాం..రచయితగామానస శర్మది శ్రీకాకుళం.. యూట్యూబ్‌లో మ్యాడ్ హౌస్ అనే మినీ సిరీస్‌కు డైలాగ్స్ రాసింది. తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కు రచయితగా పని చేసింది. ఈ రెండింటికీ మెగా డాటర్ నిహారిక కొణిదెలయే నిర్మాతగా వ్యవహరించింది. అలా నిహారిక దృష్టిలో పడింది. 2024లో సోనీ లివ్‌లో వచ్చిన బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్‌తో దర్శకురాలిగా మారింది. తర్వాత మరోసారి నిహారికతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఆమె నిర్మించిన రాకాస చిత్రంతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయం కాబోతోంది.ట్రెండింగ్‌లో డైరెక్టర్రాకాస మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక కన్నా దర్శకురాలు మానసయే ఎక్కువ హైలైట్ అవుతోంది. మాట్లాడేది తక్కువే అయినా అమాయకత్వం, సింపుల్ స్మైల్‌తో ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. ఓయ్ హీరోయిన్లా కనిపించినప్పటికీ ఆమెకు, మానసకు ఎటువంటి సంబంధం లేదు. ఇకపోతే జనాలు గుర్తుపెట్టుకునేలా, వారికి నచ్చేలా సినిమాలు తీయాలనుకుంటుంది మానస. మరి ఆమె రాకాసతో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి!నేను చాలా ఇంట్రోవర్ట్. కెమెరా అంటే మొహమాటం ఎక్కువ. అందుకే కెమెరా వెనకాల ఉండటానికే ప్రయత్నిస్తాను.- మానస శర్మ View this post on Instagram A post shared by YouWe Media (@youwemedia) చదవండి: భార్య ఉండగా రెండో పెళ్లి.. బిడ్డ తనకు పుట్టలేదన్న నటుడికి షాకిచ్చిన డీఎన్ఏ రిపోర్ట్ -
ఫిబ్రవరి, మార్చి పాయే.. ఏప్రిల్ ఏమవుతుందో?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ అద్భుతమైన హిట్స్ అందుకుంది. చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ తదితరులు తమ సినిమాలతో హిట్స్ అందుకుని మంచి ఆరంభం ఇచ్చారు. కానీ దీన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో టాలీవుడ్ కొనసాగించలేకపోయింది. కానీ ఏప్రిల్ మాత్రం సక్సెస్ అవుతుందనే ఆశలు రేపుతోంది. ఇంతకీ ఈ నెలలో తెలుగులో రాబోతున్న చిత్రాలేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్)ఈనెల తొలివారంలో శర్వానంద్ 'బైకర్' మూవీతో రాబోతున్నాడు. ట్రైలర్ బాగుండేసరికి దీనిపై కాస్త బజ్ ఏర్పడింది. సంక్రాంతికి సక్సెస్ అందుకున్న శర్వా.. దీనితోనూ హిట్ కొట్టేలానే ఉన్నాడు. దీనితోపాటు 'రాకాస' అనే హారర్ కామెడీ చిత్రం రాబోతుంది. ట్రైలర్, పాటల్లాంటివి ఓకే ఓకే అనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో? వీటితోపాటు సముద్రఖని 'కార్మేని సెల్వం', శరవణనన్ 'లీడర్' లాంటి మూవీస్ కూడా జాబితాలో ఉన్నాయి కానీ వీటిపై ఎలాంటి బజ్ లేదు.రెండో వారంలో ప్రస్తుతానికైతే నాలుగు సినిమాలున్నాయి. నిఖిల్ 'స్వయంభు' ఇదే తేదీన రావాల్సి ఉంది కానీ ప్రమోషన్స్ ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. దీంతో వాయిదా పడుతుందా అనే అనుమానం కలుగుతోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అడివి శేష్ నుంచి 'డకాయిట్' అనే చిత్రం వస్తోంది. ఈ రెండు కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నప్పటికీ హైప్ ఓ మాదిరిగానే ఉంది. వీటితో పాటు పల్లి చట్టంబి అనే మలయాళ డబ్బింగ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే తమిళ డబ్బింగ్ మూవీస్ లైనులో ఉన్నాయి. ఇవి సక్సెస్ అయితే ఆశ్చర్యమే.మూడోవారంలో మూడు తెలుగు సినిమాలొస్తున్నప్పటికీ అవన్నీ చిన్నవే. మూడేళ్ల తర్వాత నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తిక్'గా వస్తున్నాడు. తిరువీర్ 'పాపం ప్రతాప్', హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. వీటిపై ప్రస్తుతానికి ఎలాంటి బజ్ లేదు. హిట్ అయితే అదృష్టమే అనే చెప్పొచ్చు.చివరివారంలో రామ్ చరణ్ 'పెద్ది' ఉన్న నేపథ్యంలో అంతకుముందు తెలుగు చిత్రాలు రిలీజ్ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. లెజెండరీ మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్'.. 24వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇక చరణ్ 'పెద్ది' మూవీపై హైప్ బాగానే ఉంది. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీనికి పోటీగా ధనుష్ 'కర' మూవీ ఉంది. దీని ప్రమోషన్స్ కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. చూడాలి మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?ఏప్రిల్‌లో రిలీజయ్యే వాటిలో 'పెద్ది' మాత్రమే పెద్ద సినిమా. అందుకు తగ్గట్లే హైప్ ఉంది. మిగతా మూవీస్ పర్లేదనిపించే హైప్ ఉన్నప్పటికీ ఏవి హిట్ అవుతాయనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్) -
మీది చిన్న సినిమా.. ఇబ్బంది పడతారని చెప్పారు: నిహారిక
మెగా డాటర్ నిహారిక నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీ తర్వాత నిర్మాతగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన సొంతం బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై రాకాస అనే మూవీని నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వస్తోన్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 03న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నిహారిక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది. ఇలాంటి సినిమా తీస్తున్నామనగానే చాలామంది సలహాలు ఇచ్చారని తెలిపింది. వీఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలే కష్టపడాల్సి వస్తోంది.. మీది చిన్న బడ్జెట్ సినిమా.. చాలా ఇబ్బంది పెడతారు చూసుకోండని నాతో చెప్పారని గుర్తు చేసుకుంది.ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని తెలిపింది. ఓ మంచి సినిమా తీశాం.. జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేస్తున్నామని నిహారిక వెల్లడించింది. ఇంటింటికి వెళ్లి సినిమా చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని నిహారిక పేర్కొంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, కారు ఉండాలని ఆశిస్తున్నట్లు నిహారిక తన డ్రీమ్‌ను బయటపెట్టింది. కమిటీ కుర్రోళ్లు మూవీతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశానని నిహారిక తెలిపింది. -
‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎంటర్టైనింగ్గా 'రాకాస' ట్రైలర్
'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మించగా.. మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతోంది. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?)ట్రైలర్ బట్టి చూస్తే.. ఇదివరకు వచ్చిన హారర్ సినిమాల్లానే ఇందులో స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ మాత్రం సంబంధం లేని హీరో, ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడే ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా హీరో సమస్యల్లో చిక్కుకుంటాడు. బ్రహ్మ రాక్షసుడికి ఆహారంగా ఊరంతా కలిసి ఇతడిని పాడుబడ్డ కోటలోకి పంపిస్తారు. అక్కడ హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రేలంగి మామయ్యగా ఒకవేళ రాజశేఖర్ చేసుంటే?) -
పావు గంట కథ విని ఓకే చెప్పారు: మానస శర్మ
‘‘రాకాస’ కథని నిహారికగారు ఓ పావు గంట వినగానే నమ్మకంతో వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమా ఔట్పుట్ కూడా ఆమెకు నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. డైరెక్టర్‌గా ‘రాకాస’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. నాకు వెబ్ సిరీస్‌లు చేసిన అనుభవం ఉండటంతో ‘రాకాస’ తీయడం సవాల్‌గా అనిపించలేదు’’ అని డైరెక్టర్ మానస శర్మ పేర్కొన్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో చిత్రదర్శకురాలు మానస శర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా చేశాను. అనంతరం ‘బెంచ్ లైఫ్’ సిరీస్ చేశాను. ‘రాకాస’ని ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. సంగీత్ అద్భుతమైన నటుడు. అతని కామెడీ టైమింగ్ నాకు ఇష్టం.నయన్ సారిక ప్రతిభ, నటన చూసి ఈ చిత్రంలోకి తీసుకున్నాం. థియేటర్లో చూసి, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. అనుదీప్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిహారికగారు మంచి నిర్మాత. ఇక నా తర్వాతి ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఉండేలా చూసుకుంటాను’’ అని తెలిపారు. -
లంగా ఓణితో పార్టీకి వెళ్లలేం కదా.. డ్రెస్సింగ్‌పై నిహారిక కామెంట్స్
మహిళల వస్త్రధారణ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంది దుస్తులు ధరించాలనేది వారిష్టం కానీ, సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మెలగాలని ఆమె అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించొచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత మనం సొసైటీతో ఎన్నో రిలేషన్స్ పెట్టుకొని ఉంటాం, వాటికి అనుగుణంగానే వస్త్రధారణ ఉండాలి. నేను ఏదైనా ఒక పెళ్లికి వెళితే కచ్చితంగా చీర కట్టుకొనే వెళ్తాను. అలాగే నా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళితే లంగా ఓణి వేసుకొని వెళ్లలేను కదా? అలా వెళ్తే.. అందరూ కింది నుంచి పైవరకు అలా చూస్తారు(నవ్వుతూ..). మనం వెళ్లే సందర్భాన్ని బట్టి దుస్తులు ఉండాలి. టీనేజ్ లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఇలాంటి డ్రెస్ వేసుకొద్దు.. అలా రెడీ కావాలని చెబుతుంటారు. అది మనకు కండీషన్లు పెట్టినట్లు కాదు..బయట సమాజం గురించి తెలియదు కాబట్టే వాళ్లు ప్రొటెక్ట్ చేస్తున్నారనీ అర్థం. నాక్కుడా నాన్న అలాంటి సలహా ఇచ్చేవారు. అమ్మ కూడా ‘ఇది నీకు సెట్ అవ్వలేదు..అది వేసుకో బాగుంటుంది’ అని చెప్పేది. అందులో తప్పేం లేదు. టీనేజ్ దాటిన తర్వాత కూడా అలాంటి కండీషన్లు పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్లకు తెలుసు. ఏ డ్రెస్ వేసుకుంటే.. ఎలాంటి కామెంట్స్ చేస్తారో. మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దుస్తులు ధరించాలి’ అని నిహారిక చెప్పుకొచ్చింది. నిహారిక కెరీర్ విషయానికొస్తే.. నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి.. నిర్మాణ సంస్థపై ఫోకస్ చేసింది. తన బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతోంది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. -
అలా విడిపోవడం చాలా బాధాకరం..నిహారిక కామెంట్స్ వైరల్
నటిగానే కాకుండా నిర్మాతగానూ దూసుకెళ్తున్నారు మెగా డాటర్ నిహారిక. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకొని.. చిన్న బడ్జెట్‌తో మంచి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఆమె బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ అయింది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరో. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో నిహారిక బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల విషయంపై స్పందించారు.నాన్నకే చెప్పా.. నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డ అనే అబ్బాయిని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల కలిసి కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2023లో ఈ జంట విడిపోయింది.అయితే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే నిహారిక ఈ విషయాన్ని ముందుగా నాన్న నాగబాబుతో పంచుకుందట. ‘రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలని అనుకున్నప్పుడు ముందుగా మా నాన్నకు ఈ విషయాన్ని చెప్పా. ఆయన విషయం మొత్తం విని సైలెంట్ అయ్యారు. నేను సంతోషంగా లేననే విషయం వాళ్లకు కూడా తెలుసు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నగారే సలహా ఇచ్చారు’ అని నిహారిక చెప్పారు.విడిపోవాలని పెళ్లి చేసుకోరు..చాలా మంది ‘ఈ మధ్య విడాకులు కామన్ అయిపోయాయి’ అంటున్నారు. కానీ గతంలోనూ భార్యభర్తలు మధ్య విబేధాలు, గొడవలు జరిగేవి. కానీ తిరిగి ఇంటికి వెళ్తే..మా నాన్న పోషించగలరా అన్న భయంతో అలాగే కొనసాగేవారు. అప్పట్లో ఒక మహిళ తన అవసరాల కోసం కూడా అబ్బాయిపై ఆధారపడేది కానీ ఇప్పట్లో అమ్మాయిలు వాళ్లకేం కావాలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగా చూసుకునే పేరెంట్స్ ఉంటున్నారు. ఎవ్వరూ కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. మా మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివి అనిపించింది అందుకే విడాకులు తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఒకరినొకరు బాగా కొట్టుకొని విడిపోతే అది తొందరగా మరచిపోతారు కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం’ అని నిహారిక అన్నారు. విడాకుల తర్వాత మాజీ భర్తలో టచ్‌లో ఉన్నారా అని యాంకర్ అడగగా.. ‘అలాంటిదేమి లేదు. ఇంతవరకు మేము మళ్లీ కలుసుకోలేదు. ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది. -
స్నేక్ డ్యాన్స్ కోసం నిహారిక మాస్ ఎంట్రీ
'రాకాస' సినిమా నుంచి తాజాగా స్నేక్ డ్యాన్స్ సాంగ్‌ను విడుదల చేశారు. అయితే పాట చివర్లో నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది. సంగీత్ శోభన్- నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మానస శర్మ తెరకెక్కించగా.. నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. టీజర్‌తోనే మెప్పించిన మేకర్స్ ఇప్పుడు అదిరిపోయే సాంగ్‌ను విడుదల చేసి అలరించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
రాకాస అందర్నీ నవ్విస్తుంది: సంగీత్ శోభన్
సంగీత్ శోభన్ , నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో సంగీత్ శోభన్ మాట్లాడుతూ– ‘‘రాకాస’ సినిమా కొత్తగా ఉంటుంది. అందర్నీ నవ్విస్తుంది. ప్రేక్షకులు ఖర్చుచేసే టికెట్ డబ్బులకు న్యాయం చేసేలా ఉంటుంది.నిహారిక, మానసగార్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో సంగీత్ యాక్టర్‌గా మరింత షైన్ అవుతాడు. థియేటర్స్‌కు వచ్చిన ఆడియన్స్ ను నిరాశపరచం’’ అని చెప్పారు నిహారిక కొణిదెల. ‘‘ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశాం. ప్రేక్షకులు మా సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు మానస శర్మ. ఈ కార్యక్రమంలో జీ5 తెలుగు కంటెంట్ హెడ్ దివ్య, సంగీత దర్శకుడు అనుదీప్, నటీనటులు రోహిణి, గెటప్ శ్రీను మాట్లాడారు. -
సంగీత్ శోభన్ 'రాకాస' మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నిహారిక నిర్మాతగా హారర్ కామెడీ సినిమా.. టీజర్ రిలీజ్
'మ్యాడ్' రెండు సినిమాలతో నటుడిగా ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక ఈ చిత్రాన్ని నిర్మించింది. మానస శర్మ అనే దర్శకురాలు ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)టీజర్ బట్టి చూస్తే హీరో అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా ఓ ఊరికి వెళ్తాడు. అయితే ఆ ఊరిని ఏళ్లుగా ఓ శాపం ఉంటుంది. పాడుబడ్డ భవంతి కూడా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఊరివాళ్ల సమస్యలోకి హీరో ఎంటర్ అవుతాడు. హీరోయిన్, మరో వ్యక్తి కూడా ఇతడికి తోడవుతారు. మరి బూత్ బంగ్లా నుంచి హీరో అండ్ గ్యాంగ్ బయటపడ్డారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తోంది.టీజర్ బట్టి చూస్తుంటే రెగ్యులర్ హారర్ కామెడీ టెంప్లేట్ స్టోరీలానే అనిపిస్తుంది కానీ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయిపోవచ్చు. ఈ సంక్రాంతికి ప్రభాస్ నుంచి 'రాజాసాబ్' అనే హారర్ కామెడీ వచ్చింది. కంటెంట్ సరిగా లేకపోవడంతో ఫ్లాప్ అయింది. మరి 'రాకాస' టీమ్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)


