మయన్మార్‌లో పడవ మునిగి 34 మంది మృతి
యంగాన్: మయన్మార్‌లోని పశ్చిమ తీరంలో పడవ మునిగి 34 మంది మృతిచెందారు. సుమారు 216 మంది ప్రయాణికులతో బయల్దేరిన పడవ క్యాప్క్యూ పట్టణం నుంచి రాఖిన్ రాష్ట్రంలోని సిట్వేకు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 12 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికి తీయగా, అందులో 19 మహిళలవని, రెండు మృతదేహాలు పురుషులవని పోలీసులు చెప్పారు.