నయనతార విశ్వరూపం మీరూ చూసేయండి
లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చింది. తాజాగా తన నటించనున్న కొత్త సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న నయన్ 'రక్కయీ' (RAKKAYIE) అనే కొత్త సినిమాను ప్రకటించింది. కథలో ఉమెన్ పాత్రకు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చేలా టీజర్ ఉంది. ఈ చిత్రానికి సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రమ్ స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వర్స్‌ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. తల్లి పాత్రలో నటిస్తున్న నయన్తన కూతురు కోసం చేసే పోరాటం చాలా భయంకరంగా ఉండబోతుందని దర్శకుడు టీజర్లోనే చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది.