సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో విశాలాంధ్ర మహాసభ ర్యాలీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రెండో రోజూ ఢిల్లీలో ఆందోళన చేపడుతున్నారు. ఆదివారం జంతర్ మంతర్ వద్ద సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించనున్నారు.
శనివారం విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయి.