నిలకడగా ఎమ్మెల్యే ఆరోగ్యం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు.
'తీవ్ర జ్వరం, ఫిట్స్‌తో ఆయన ఆస్పత్రిలో చేరారు. నాలుగేళ్ల క్రితం ఆయన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి తరచుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు' అని కిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.