కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
పాలేరు(ఖమ్మం): కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాలేరు మండలం ఆరెంపుల గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గుదిమల్ల రామనర్సమ్మ(54) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతోంది. దీంతో ఈ రోజు గ్రామ శివారులోని మామిడితోటలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.