పుష్కర పూజలపై అవగాహన
షాద్నగర్రూరల్: ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో గహంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఎయే కార్యక్రమాలు చేయకూడదనే సందేహాలు ఉండటం సహజం. కష్ణా పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభంకానున్న సందర్భంగా ప్రజలకు ఉన్న అపోహలౖపై పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి షాద్నగర్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ముందుకు వచ్చింది. పుష్కర సమయంలో ఎలాంటి పనులు చే యాలి? ఎలాంటి పనులు చేయకూడదనే విషయాన్ని బ్రాహ్మణసేవా సమాఖ్య పట్టణ ప్రధాన కార్యదర్శి చిలుకూరి రామసత్యనారాయణ శర్మ బుధవారం వివరంగా తెలిపారు. పుష్కరకాలం అనేది ఎంతో పవిత్రమైనదని ఈ సమయంలో దాన ధర్మాలు, పిండ ప్రధానాలు, వ్రతాలు , నోములు వంటి కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చని తెలిపారు. వ్రతాలకు పుష్కర కాలం చాలా మంచిదని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే పుష్కర నదీ పరివాహక ప్రాంతం చుట్టూ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు పుష్కరాల సమయంలో వివాహాలు, గహప్రవేశాలు. భూమిపూజలు చేయరాదన్నారు.