breaking news
ramachandrapur
-
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి పి.ప్రభుగౌడ్, పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం రామచంద్రాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వారు ఓటర్లకు వివరించారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక పథకాలతో ఎంతోమంది లబ్ధిపొందారన్నారు. రుణ మాఫీతో రైతులు, పింఛన్లతో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందన్నారు. ఇవన్నీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘనతేనని తెలిపారు. ఇలాంటి పథకాలు సక్రమంగా కొనసాగాలంటే తమను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యులు సంజీవరావు, నాయకులు రాజశేఖర్, ఖాసీం, నయీం, విఠల్, సందీప్, రాజు, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో.. సంగారెడ్డి అర్బన్: వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంగారెడ్డిలోని మంజీర నగర్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. స్థానికుడితోపాటు రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు జిల్లా ప్రజలు, రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తనను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేపడతానని హామీ ఇచ్చారు. ప్రచారంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు శివశంకర్ పాటిల్, నాయకులు సుధాకర్ గౌడ్, జగదీష్, హరికృష్ణాగౌడ్, మహేశ్, జగన్, సురేశ్, వైద్యనాథ్, శివ, రిశేందర్ గౌడ్, సుభాన్ , నాగు, నరేశ్, నరేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో అధికారం వైఎస్సార్ సీపీదే
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ బీసీ సెల్ ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల కోఅర్డినేటర్ సతీష్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ బీసీ విభాగం క న్వీనర్‌గా జాక్సన్‌ను నియమిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ర్ట బీసీ విభా గం కన్వీనర్ గట్టు రామచంద్రారావు నియామకపత్రాన్ని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం వైఎస్సార్‌సీపీతోనే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం చేసే సత్తా కేవలం వైఎస్సార్సీపీకే ఉందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవాడు రెండు పూటలా తినలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మహానేత వైఎస్సార్ ప్రజల మధ్య లేకున్నా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో గడపగడపకు వెళ్లి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ బీసీ విభాగం డివిజన్ కన్వీనర్ జాక్సన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.