రామచంద్రాపురం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి పి.ప్రభుగౌడ్, పటాన్‌చెరు అసెంబ్లీ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం రామచంద్రాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వారు ఓటర్లకు వివరించారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక పథకాలతో ఎంతోమంది లబ్ధిపొందారన్నారు.
రుణ మాఫీతో రైతులు, పింఛన్లతో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందన్నారు. ఇవన్నీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘనతేనని తెలిపారు. ఇలాంటి పథకాలు సక్రమంగా కొనసాగాలంటే తమను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యులు సంజీవరావు, నాయకులు రాజశేఖర్, ఖాసీం, నయీం, విఠల్, సందీప్, రాజు, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి అర్బన్: వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంగారెడ్డిలోని మంజీర నగర్‌లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. స్థానికుడితోపాటు రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు జిల్లా ప్రజలు, రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తనను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేపడతానని హామీ ఇచ్చారు. ప్రచారంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు శివశంకర్ పాటిల్, నాయకులు సుధాకర్ గౌడ్, జగదీష్, హరికృష్ణాగౌడ్, మహేశ్, జగన్, సురేశ్, వైద్యనాథ్, శివ, రిశేందర్ గౌడ్, సుభాన్ , నాగు, నరేశ్, నరేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
Published Mon, Apr 14 2014 12:07 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement