p.prabhu goud
-
వైఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి పింఛన్లు
సంగారెడ్డి క్రైం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి. ప్రభుగౌడ్ కొనియాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. జోగిపేటలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు, రుణమాఫీ తదతర పథకాల అమలు విషయంలో వైఎస్ రాజీ పడకుండా కృషి చేశారన్నారు. ఆయన పథకాలను ఇతర రాష్ర్ట ముఖ్యమంత్రులు సైతం ఆదర్శంగా తీసుకొని ఆచరణలో పెట్టారన్నారు. వైఎస్ పాలన మళ్లీ రావాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. పేద, మధ్య, బడుగు,బలహీన వర్గాలు మెచ్చే పాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. 2019లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎ స్సార్ కాం గ్రెస్ పార్టీ నాయకులు శ్రీని వాస్‌రెడ్డి, ఎస్ఎస్ పాటిల్, రాం రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, మ క్సూద్ అలీ, జగదీష్, అరవిం ద్‌రెడ్డి, రవి, సుభాన్, జహాంగీర్, సం తోష్, వీరేష్, వైద్యనాథ్, వెంకట రమణ, ధీరజ్, సంకీర్త్, సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
మీ ప్రభుత్వం ఏం ఒరగబెట్టింది!
కాంగ్రెస్ నేతలు పొన్నాల, జీవన్‌రెడ్డిని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ సంగారెడ్డి క్రైం : అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏమిటో ఆ పార్టీ నేతలు పొన్నాల, జీవన్‌రెడ్డి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించడాన్ని ఆయన తప్పు బట్టారు. కాంగ్రెస్‌పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్హులందరికీ పింఛన్లు ఎందుకు అందజేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, అర్హులైన వారికి పింఛన్లు రాకపోవడం వల్లనే ప్రజలు కాంగ్రెస్ పాలనకు స్వస్తి చెప్పారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే కావస్తోందని, ఇంత తక్కువ సమయంలోనే ఏమీ చేయడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరి కాదన్నారు. చీటికిమాటికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు లేనిపోని విమర్శలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు అందాయన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేయడం వల్లనే ప్రజలు వైఎస్‌ను మరువలేకపోతున్నారన్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన నిరుపేదల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తమ సమస్యలు విన్నవించుకొనేందుకు వచ్చిన సత్యసాయి కార్మికులతో మంత్రి హరీష్రాావు వ్యవహరించిన తీరువల్లేనే సత్యసాయి కార్మికుడు మనస్థాపం చెంది మరణించాడని, మంత్రి హోదాలో ఉన్న ఆయనకు ఇది తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్, అందోల్ నియోజకవర్గ ఇన్చార్జి సంజీవరావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు మంత్రి ముందు తమ గోడు వెళ్లబోసుకోగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన మంత్రి దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమన్నారు. సత్యసాయి కార్మికుల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ హయాంలోనే రైతుకు భరోసా
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: వ్యవసాయం దండగని టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. కాదు పండుగ అని చెప్పడమే కాదు నిరూపించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి పి.ప్రభుగౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మెదక్ అసెంబ్లీ అభ్యర్థి అల్లారం క్రీస్తుదాసుతో కలిసి మండలంలోని పాతూర్, అవుసులపల్లి, ఔరంగాబాద్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాతూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుగౌడ్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు ఉచిత విద్యుత్ అందించి వారి బతుకులకు భరోసా కల్పించారని గుర్తుచేశారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రత్యేకంగా జీఓ తీసుకొచ్చారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి వర్తించాయన్నారు. పేదలకు కార్పొరేట్ విద్యతోపాటు వైద్యాన్ని కూడా అందించినట్టు తెలిపారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలను గుర్తించి ఇతర పార్టీలను చిత్తుగా ఓడించాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనతోపాటు మెదక్ అసెంబ్లీ అభ్యర్థి క్రీస్తుదాసును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బద్దం వెంకటరాంరెడ్డి, జె.రాములు, గుట్ట మీది రమేశ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఓటేసి రాజన్న రుణం తీర్చుకోండి.. పాపన్నపేట: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవాలని ఆ పార్టీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి పి.ప్రభుగౌడ్ కోరారు. శుక్రవారం ఏడుపాయల దుర్గాభవానిమాతను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం నాగ్సాన్పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద ప్రజల కోసం జీవితాన్నే దారపోసిన మహా నేత వైఎస్ రుణం తీర్చుకోవాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆదరించాలన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందితేనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి పి.ప్రభుగౌడ్, పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం రామచంద్రాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వారు ఓటర్లకు వివరించారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక పథకాలతో ఎంతోమంది లబ్ధిపొందారన్నారు. రుణ మాఫీతో రైతులు, పింఛన్లతో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందన్నారు. ఇవన్నీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘనతేనని తెలిపారు. ఇలాంటి పథకాలు సక్రమంగా కొనసాగాలంటే తమను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యులు సంజీవరావు, నాయకులు రాజశేఖర్, ఖాసీం, నయీం, విఠల్, సందీప్, రాజు, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో.. సంగారెడ్డి అర్బన్: వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంగారెడ్డిలోని మంజీర నగర్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. స్థానికుడితోపాటు రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు జిల్లా ప్రజలు, రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తనను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేపడతానని హామీ ఇచ్చారు. ప్రచారంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు శివశంకర్ పాటిల్, నాయకులు సుధాకర్ గౌడ్, జగదీష్, హరికృష్ణాగౌడ్, మహేశ్, జగన్, సురేశ్, వైద్యనాథ్, శివ, రిశేందర్ గౌడ్, సుభాన్ , నాగు, నరేశ్, నరేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్లకు తెర
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక సంగ్రామంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరిరోజైన బుధవారం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గాల వారీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు, నామినేషన్ సెట్ల సంఖ్యపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇవ్వలేకపోయింది. సమాచార శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు మొత్తం 67 నామినేషన్లు రాగా, చివరి రోజే 53 దాఖలయ్యాయి. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 269 నామినేషన్లు రాగా ఒక్క బుధవారమే 178 దాఖలయ్యాయి. మెదక్, జహీరాబాద్ లోక్‌సభలకు పోటాపోటీ మెదక్ లోక్‌సభ స్థానానికి 15 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరిరోజు బుధవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్సార్ సీపీ అభ్యర్థి పి. ప్రభుగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి టి. శ్రావణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్లతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. ఇక జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి చివరి రోజు 12 మంది అభ్యర్థులు 18 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్, టీఆర్ఎస్ అభ్యర్థి భీంరావు పాటిల్, ఆప్ అభ్యర్థి సునీల్ కుమార్ వెనిగల్ల, బీఎస్పీ అభ్యర్థి ఫరీదుద్దీన్‌తో పాటు ఏడు మంది స్వతంత్రులు ఉన్నారు. దాఖలైన నామినేషన్లను గురువారం సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఉంది. అసెంబ్లీల నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్లు.. సిద్దిపేట సిద్దిపేట అసెంబ్లీకి మొత్తం 26 మంది 54 సెట్ల నామినేషన్లు వేయగా, చివరి రోజే 15 మంది అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు, వైఎస్సార్ సీపీ తరఫున పడక జగదీశ్వర్, కాాంగ్రెస్ తరఫున తల్లూరి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ తరఫున సీహెచ్ విద్యా సాగర్, టీడీపీ తరఫున మెరుగు మల్లేషం చివరి రోజు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ రెబల్ చొప్పదండి చంద్రశేఖర్ కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ మెదక్ అసెంబ్లీ స్థానానికి.. 15 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. చివరి రోజే 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున విజయశాంతి, టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున అల్లారాం క్రీస్తుదాస్, టీడీపీ తరఫున భట్టి జగపతి, గడిల శ్రీనివాస్‌రెడ్డిలు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. అందోల్ అందోల్ అసెంబ్లీ స్థానానికి 10 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు వేయగా.. ఒక్క చివరి రోజే 8 మంది అభ్యర్థులు 12 సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, వైఎస్సార్ సీపీ తరఫున సంజీవరావు, టీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి పి.బాబూమోహన్, బీజేపీ తరఫున బుర్రె ఎల్లయ్య, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బి.మొగులయ్యలు చివరి రోజు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. దుబ్బాక దుబ్బాక అసెంబ్లీ స్థానానికి మొత్తం 15 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు రాగా.. చివరి రోజు 8 మంది అభ్యర్థులు 8 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున ఎం. శ్రవణ్ కుమార్, బీజేపీ నుంచి ఎం రఘునందన్ రావు, బీఎస్పీ నుంచి రాచకట్ల లక్ష్మి, టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి బి. రవికుమార్ నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మూడు రోజుల కిందే నామినేషన్లు దాఖలు చేయగా..ఆయన బి-ఫారం అందలేదు. గజ్వేల్ గ జ్వేల్ అసెంబ్లీ స్థానానికి 10 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన బుధవారమే 9 మంది అభ్యర్థులు 12 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, వైఎస్సార్సీపీ తరఫున డి. పురుషోత్తం రెడ్డి, టీడీపీ తరఫున ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, బీజేపీ రెబల్ అభ్యర్థిగా ఆకుల నరేశ్‌బాబులు బుధవారం నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. నర్సాపూర్ నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 15 మంది అభ్యర్థుల నుంచి 30 సెట్ల నామినేషన్లు రాగా..చివరి రోజే 13 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్ వేశారు. వైఎస్సార్ సీపీ తరఫున డాక్టర్ బస్వానందం, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సునీతా రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి తిరుమల మదన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థులు .. చాగండ్ల బల్వీందర్, సింగాయిపల్లి గోపిలు రెండు బీ-ఫారంలు ఇచ్చారు. సీపీఎం తరఫున లక్ష్మీభాయి, మల్లేషం, జై సమైక్యాంధ్ర పార్టీతరఫున మహమ్మద్ మాజీద్ అలీ, బీఎస్పీ నుంచి శాంత కుమార్‌లు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. పటాన్చెరు పటాన్చెరు అసెంబ్లీ స్థానానికి మొత్తం 28 మంది అభ్యర్థుల నుంచి 42 సెట్ల నామినేషన్లు రాగా.. చివరి రోజే 20 మంది అభ్యర్థులు 22 సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే టి.నందీశ్వర్ గౌడ్, వైఎస్సార్ సీపీ తరఫున గురుజాల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ తరఫున గూడెం మహిపాల్ రెడ్డి, బీజేపీ తరఫున సి. అంజిరెడ్డి, ఎంఐఎం తరఫున సయ్యద్ రెహ్మత్లు చివరి రోజు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. సంగారెడ్డి సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా..చివరి రోజే 26 మంది అభ్యర్థులు 40 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే టి. జయప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ తరఫున చింతా ప్రభాకర్, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ చివరి రోజు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. జహీరాబాద్ జహీరాబాద్ అసెంబ్లీ స్థానానికి 19 మంది అభ్యర్థులు 34 సెట్ల నామినేషన్లు వేయగా.. చివరి రోజు 14 మంది అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జె. గీతారెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున నల్లా సూర్యప్రకాశ్‌రావు, టీడీపీ తరపున వై.నరోత్తం, టీఆర్ఎస్ తరఫున మాణిక్ రావులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. నారాయణ్‌ఖేడ్ నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్లు వేయగా..చివరి రోజు 7 మంది 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున అప్పారావు షెట్కార్, టీఆర్ఎస్ తరఫున ఎం. భూపాల్ రెడ్డి చివరిరోజు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్లను ప్రజలు నమ్మరు
నర్సాపూర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. ప్రభుగౌడ్ అన్నారు. సోమవారం ఆయన నర్సాపూర్ వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చామని, తెచ్చామని ఆ పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. అమరుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారిని పట్టించుకున్న నాయకులే కరువయ్యారని ప్రభుగౌడ్ విచారం వ్యక్తం చేశారు. అమరుల కుటుంబ సభ్యులకు సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా తాము సంఘీభావం తెలుపుతామని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలు అధికార దాహంతో ముందుకు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆ పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. కాగా జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, పేదలందరికీ ఇళ్లు, ఇంకా అనేక పథకాలు వైఎస్ మంజూరు చేశారని ప్రభుగౌడ్ తెలిపారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తాయన్నారు. వైఎస్ మరణం తర్వాత ఆయన చేపట్టిన పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచి పేదలను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు. సమావేశంలో ప్రభుగౌడ్తో పాటు పార్టీ జిల్లా బీసీ సెల్ నాయకుడు సుధాకర్‌గౌడ్, కొండాపూర్ మండల శాఖ అధ్యక్షుడు అశోక్ గౌడ్, సంగారెడ్డి మండలశాఖ అధ్యక్షుడు హరికృష్ణగౌడ్ పాల్గొన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు కౌడిపల్లి: ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారంకావని, గుండెనిబ్బరంతో ధైర్యంగా ముందుకుసాగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. మండలంలోని వెల్మకన్నెలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు గొల్ల రమేష్ (34) కుటుంబ సభ్యులను సోమవారం ప్రభుగౌడ్ పరామర్శించారు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం కలిసిరాక అప్పులు పేరుకుపోవడంతో ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్యలవల్ల సమస్యలు పరిష్కారంకావన్నారు. కార్యక్రమంలో పార్టీ బీసీసెల్ కొండాపూర్ మండలం అధ్యక్షుడు అశోక్‌గౌడ్, నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.