వైఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి పింఛన్లు | everyone get pensions in ysr ruling | Sakshi
Sakshi News home page

వైఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి పింఛన్లు

Published Sun, Dec 21 2014 10:48 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి పింఛన్లు - Sakshi

వైఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి పింఛన్లు

సంగారెడ్డి క్రైం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి. ప్రభుగౌడ్ కొనియాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

జోగిపేటలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ  ఉచిత విద్యుత్తు, రుణమాఫీ తదతర పథకాల అమలు విషయంలో వైఎస్ రాజీ పడకుండా  కృషి చేశారన్నారు. ఆయన పథకాలను ఇతర రాష్ర్ట ముఖ్యమంత్రులు సైతం ఆదర్శంగా తీసుకొని ఆచరణలో పెట్టారన్నారు. వైఎస్ పాలన మళ్లీ రావాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు.

పేద, మధ్య, బడుగు,బలహీన వర్గాలు మెచ్చే పాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. 2019లో తెలంగాణ రాష్ట్రంలో  వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎ స్సార్ కాం గ్రెస్ పార్టీ నాయకులు శ్రీని వాస్‌రెడ్డి, ఎస్‌ఎస్ పాటిల్, రాం రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, మ క్సూద్ అలీ, జగదీష్, అరవిం ద్‌రెడ్డి, రవి, సుభాన్, జహాంగీర్, సం తోష్, వీరేష్, వైద్యనాథ్, వెంకట రమణ, ధీరజ్, సంకీర్త్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement