Ramagundam Police Commissionerate
-
సెల్యూట్ పోలీస్.. 7 నిమిషాల్లో రక్షించారు
చనిపోవాలని అనుకున్నాడు. ఉరితాడు ప్యాన్‌కు వేలాడింది. చావు చివరి కోరిక వీడియో సందేశాన్ని పోన్ ద్వారా పంపాడు. చివరికి ఆ సందేశం ఆధారంగానే అతన్ని ఉరితాడు నుంచి విముక్తి కల్పించారు పోలీసులు. 7 నిమిషాల్లో నిండు ప్రాణాలను కాపాడి తల్లి వద్దకు కొడుకుని చేర్చిన సంఘటన మంచిర్యాల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. చెన్నూరులోని ఓ వ్యక్తి కుటుంబ సమస్యలతో బాధపడుతూ అత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్యాన్ ఉరివేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో తను చనిపోతున్నానని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. చదవండి: పల్లెల్లో షీటీమ్స్! వెంటనే అప్రమత్తమైన అతని తల్లి, మిత్రులు చెన్నూరు పోలీసులను ఆశ్రయించారు. పోన్ సందేశాన్ని పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఆధారంగా ఉరేసుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే సంబంధిత ప్రాంతానికి పోలీసులు నిమిషాల్లో చేరుకొని బాధితుడి ప్రాణాలు కాపాడారు. ఇదంతా కేవలం ఏడు నిమిషాలలో జరిగిపోవడంతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసుల తీరును కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ విషయాన్నిరామగుండం పోలీస్ కమిషనర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. -
ఆటోలపై పోలీస్ పంజా..
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్) : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో అక్రమ దందాలకు, అసాంఘిక కార్యకలపాలకు చరమగీతం పాడేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు అక్రమార్కులపై రామగుండం కొత్వాల్ కొరడ ఝలిపిస్తున్నారు. ఇదే క్రమంలో కమిషనర్ సత్యనారాయణ ఆటో డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆటోలపై ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో సుమారు 10 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కొందరు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆటోలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. మరి కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి ప్రయాణికులను టార్గెట్ చేసి దాడికి పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. దీంతో పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెండు జిల్లాల పోలీస్ అధికారులకు గురువారం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆటోల్లో అదనపు సీట్ల తొలగింపు ఆటోడ్రైవర్ సీటు పక్కన అదనపు సీట్లు ఏర్పాటు చేసి పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదనపు సీటు కలిగి ఉండి పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండగా పట్టుబడిన ఆటోలకు మొదటి సారి రూ. 1000 జరిమానా విధించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. మరో సారి అదే తప్పు చేసి పట్టుబడితే రూ. 2 వేలు జరిమానాతో పాటు ఆటో సీజ్ చేసి 10 రోజులు పోలీస్‌స్టేషన్‌లో ఉంచుతారు. మూడో సారి అలానే జరిగితే క్రిమినల్ కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తారు. ఓనర్లు లైసెన్స్ లేని డ్రైవర్లకు ఆటోలు నడపడానికి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నుంచి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారిపై, ఆటో యజమానులపై కేసులు నమోదు చేయనున్నారు. ఆరుగురిని మించి తరలించరాదు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలో ఆరుగురు కంటే ఎక్కువ విద్యార్థులను తరలించరాదు. కానీ చాలా ఆటోల్లో 10కి మించి స్కూల్ పిల్లలను తరలిస్తున్నారు. దీని వల్ల ప్ర మాదం జరిగే అవకాశాలు ఎ క్కువ. అంతే కాకుండా పొరపాటున ఏదైన ప్రమాదం జరిగినా తీవ్ర నష్టం సంభవిస్తుంది. ఇక నుంచి ఆరుగురి కంటే ఎక్కువ స్కూల్ విద్యార్థులను ఆటోలో తరలిస్తే డ్రైవర్లతో పాటు పాఠశాల యాజమాన్యాలపై సైతం కేసులు నమోదు చేస్తారు. అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ప్రయాణికుల పట్ల ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆటొలో ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేసి మా యలో పడేసి దాడులకు పాల్పడుతున్నారు. ప్ర యాణికుల వద్ద అధిక కిరాయి వసూలు చేసిన వారిపై సైతం చర్యలు తీసుకోనున్నారు. పట్ట ణాల్లో బ్లూ కోట్ పోలీసులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. కొందరు పోలీసులు ఎవరికి తెలియకుండా మఫ్టిలో ఉంటూ నిఘా పెట్టనున్నారు. రహదారులపై ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఆటోలు నడిపినా, పార్కింగ్ చేసినా, మూల మలుపుల వద్ద ఆటోలు నిలిపినా కఠిన చర్యలు తప్పవు. కాలం చెల్లిన ఆటోలపై నజర్ కమిషనరేట్ పరి«ధిలో కాలం చెల్లిన ఆటోలపై పోలీసులు దృష్టి సారించారు. ఫిట్నెస్ లేని ఆటోలను సీజ్ చేయడం జరుగుతోంది. కాలం ముగిసిన వాహనాలు నడుపడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతోంది. కాలం చెల్లిన వాహనాలు రోడ్డుపై కనిపిస్తే డ్రైవర్లు, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. -
త్యాగాలు మరువలేనివి
గోదావరిఖని(రామగుండం): సమాజ సేవలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు మరువలేనివని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వుడ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరారు. ప్రజాసేవకులుగా పజల ధన, మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావాలన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం వంటి విచ్ఛినకర శక్తులు, నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడాల్సి రావడంతో పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాగా మారిందన్నారు. పోలీసుల తప్పులు ప్రచారం అవుతున్నంతగా వారి త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవడం లేదన్నారు. త్యాగాలు చేసే వారిని గుర్తించడం లేదన్నారు. ఈ ఏడాది దేశంలో విధి నిర్వహణలో 414 మంది వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని, వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను కాపాడమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. పోలీసులు చేస్తున్న అత్యున్నత త్యాగాలను సమాజం గుర్తించుకునే విధంగా ప్రముఖ దిన పత్రికలలో ప్రకటనలు బ్యానర్లు, కమిషరేట్‌లో, పోలీస్స్టేషన్లలో ఓపెన్‌హౌస్ కార్యక్రమాలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రజల కోసం అసువులు బాసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. నివాళ్లర్పించడానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సీపీ వివరాలు తెలుసుకున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈసందర్భంగా అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. అమరవీరులకు నివాళి.. ప్రజాసేవలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు సీపీ ఘన నివాళి అర్పించారు. స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళ్లర్పించారు. వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ టి.సుదర్శన్‌గౌడ్, మంచిర్యాల డీసీపీ ఎం.వేణుగోపాల్‌రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్, లాఅండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీలు రక్షిత కె.మూర్తి, బాలుజాదవ్, హబీబ్‌ఖాన్, గౌస్‌బాబా, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్లు, ఏఆర్, సివిల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు కృషి
► సీపీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ► పోలీస్ కమిషనరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ విక్రమ్‌జిత్ దుగ్గల్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. 2017 సంవత్సరంలో నేరాల నియంత్రణకు మరింత కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి, మంచిర్యాల డీసీపీ జాన్ వెస్లీ, మంచిర్యాల ఏసీపీ చెన్నయ్య, పెద్దపల్లి ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు వెంకటేశ్వర్, దేవారెడ్డి, వాసుదేవరావు, వెంకటేశ్వర్లు, ఆర్ఐ సుందర్రావు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మరో కార్యక్రమంలో సీపీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, నాయకులు యాదగిరి సత్తయ్య, షబ్బీర్‌అహ్మద్, అజీజ్, హబీబ్‌బేగ్, పినకాశి మొగిలి పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి.. కోల్‌సిటీ : గోదావరిఖని గాంధీనగర్‌లోని ఎండీహెచ్‌డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ శనివారం రాత్రి న్యూ ఇయర్ కేక్ కట్‌చేసి, పిల్లలకు మిఠాయి, పండ్లు పంపిణీ చేశారు. పిల్లల మధ్య వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని సీపీ వెల్లడించారు. అనాథ పిల్లలను ప్రోత్సహించానికి అందరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్, ఎస్సై దేవయ్య, ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై పోస్టర్ ఆవిష్కరణ గోదావరిఖని : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సం దర్భంగా ట్రాఫిక్ రూల్స్‌కు సంబంధించిన పోస్టర్‌ను కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆదివారం రాత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసో టీం ఇండియా అధ్యక్షుడు ఘనశ్యామ్ ఓజా, సభ్యులు హిర్సాద్, సిరాజ్, సమద్ బాజుమల్, సలీం, తిరుపతి, అయోధ్య రవి తదితరులు పాల్గొన్నారు.