రామయ్యకు రూ.10 లక్షల కిరీటం
భద్రాచలం:
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం కేటిల్కు చెందిన మేళ్లచెర్వు శ్రీకాంత్ సత్యనారాయణ, నావర్ధిని దంపతులు, కుటుంబసభ్యులు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రూ.10 లక్షల విలువైన బంగారు కిరీటం (311 గ్రాముల 270 మిల్లీ గ్రాములు), రూ.2 లక్షల విలువైన బంగారు పగడాల హారం (58 గ్రాముల 310 మిల్లీ గ్రాములు)లను కానుకగా ఇచ్చారు. ఉదయం శ్రీకాంత్ కుటుంబసభ్యులు అంతరాలయంలోని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. శ్రీలక్ష్మీతయారమ్మవారిని, ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఈ బంగారు కిరీటాన్ని ప్రతిరోజు దర్బారు సేవలో స్వామివారికి ధరింపజేయనున్నారు.