ramakrishna raju
-
రివైజ్డ్ డిజైన్లు ఇవ్వకనే బరాజ్‌కు నష్టం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్‌ను తొలిసారి 2019లో నీళ్లతో నింపారని, అదే ఏడాది బరాజ్‌కు నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణరాజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు వెల్లడించారు. బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ పూర్తిగా ధ్వంసమైనట్టు గుర్తించి, నీటిపారుదల శాఖకు నివేదించామని వివరించారు. బరాజ్‌లో లోపాలను సరిదిద్దేందుకు రివైజ్డ్ డిజైన్లు, డ్రాయింగ్స్‌ను నీటిపారుదల శాఖ అందించలేదని, దీంతో సమస్య పెరిగి 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్ కుంగిపోయిందని పేర్కొన్నారు. ముందే రివైజ్డ్ డిజైన్లు ఇచ్చి ఉంటే బరాజ్‌ను రక్షించుకోవడానికి అవకాశం ఉండేదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ప్రతినిధులకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. డిజైన్లతో మాకు సంబంధం ఉండదు.. ‘‘మేడిగడ్డ, ఇతర బరాజ్‌లలో 2019లో ఒకే తరహా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నీటి పారుదల శాఖ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఇంజనీర్ల ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబోరేటరీస్ (టీఎస్ఈఆర్ఎల్)తో మళ్లీ మోడల్ స్టడీస్ నిర్వహించాలని క్షేత్రస్థాయిలోని ఈఈ పైఅధికారులకు లేఖ రాశారు. 2020 జూన్‌లో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు, సీడీఓ ఇంజనీర్లు బరాజ్‌లను పరిశీలించారు. బరాజ్ రక్షణ కోసం ఎనర్జీ డిస్సిపేషన్ పనుల డిజైన్లను రూపొందించాలని 2020 ఫిబ్రవరిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ.. సీడీఓ సీఈను ఆదేశించారు.టీఎస్ఈఆర్ఎల్ నిర్వహించిన 2డీ మోడల్ స్టడీస్ ఆధారంగా.. బరాజ్ దిగువన తగిన రీతిలో ఎనర్జీ డిస్సిపేషన్ ఏర్పాట్లు చేసేందుకు డిజైన్లను అందించాలని 2021 మార్చిలో కోరారు. రిటైర్డ్ ఈఎన్సీలతో కూడిన నిపుణుల కమిటీ 2022 మార్చిలో బరాజ్‌లను సందర్శించి షూటింగ్ వెలాసిటీని తగ్గించాలని సూచించింది. కానీ రివైజ్డ్ డిజైన్లు అందించకపోవడంతో బరాజ్ కుంగింది’’అని కమిషన్‌కు ఎంవీ రామకృష్ణరాజు వివరించారు. పీస్ రేటు కాంట్రాక్టు విధానంలో పనులు దక్కించుకున్న తమకు డిజైన్ల తయారీతో సంబంధం ఉండదని తెలిపారు. గడువులోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉన్నా నాణ్యతలో రాజీపడలేదని పేర్కొన్నారు.విజిలెన్స్ విభాగం బరాజ్ నుంచి 90 కాంక్రీట్ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తే.. ప్రమాణాలకు మించిన నాణ్యత ఉన్నట్టు తేలిందని వివరించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో లోపాలపై కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేసిన ‘ఎల్ అండ్ టీ’మాజీ ఉన్నతాధికారి అమర్‌పాల్ సింగ్ వ్యవహారంపై స్పందించేందుకు ఎంవీ రామకృష్ణరాజు నిరాకరించారు.మరో ఇద్దరు ప్రతినిధుల క్రాస్ ఎగ్జామినేషన్‌లో.. ⇒ బరాజ్ గేట్ల నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్ వెలాసిటీ)తో దిగువన నేలను తాకుతుందనే అంచనాలతో నీటి పారుదల శాఖ (సీడీఓ) డిజైన్లను రూపొందించగా.. వాస్తవ వేగం సెకనుకు 16 మీటర్లుగా ఉందని, డిజైన్లలో లోపాలున్నాయని ఐఐటీ రూర్కీ అధ్యయనంలో తేలిందని ‘ఎల్ అండ్ టీ’హైడల్ ప్రాజెక్టు విభాగం ఉపాధ్యక్షుడు ఎస్.సురేశ్‌కుమార్ కమిషన్‌కు వివరించారు.⇒ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రామరాజు బరాజ్‌ను సందర్శించి 2022 వర్షాకాలానికి ముందే షూటింగ్ వెలాసిటీని తగ్గించే ఏర్పాట్లు చేయాలని, లేకుంటే బరాజ్ దెబ్బతింటుందని హెచ్చరించారని కమిషన్‌కు ‘ఎల్ అండ్ టీ’డీజీఎం రజనీష్ పి.చౌహాన్ తెలిపారు. 7వ బ్లాక్‌కు మరమ్మతులు సాధ్యం కాదని, పూర్తిగా పునర్నిర్మించక తప్పదని పేర్కొన్నట్టు తెలిసింది. -
కాంగ్రెస్, టీడీపీల కోవర్టు
రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్సీపీ నేతల ధ్వజం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా, కాంగ్రెస్, టీడీపీల కోవర్టులా పనిచేసినందువల్లే నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి రఘురామకృష్ణంరాజును తప్పించినట్లు పార్టీ నేతలు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, సర్రాజు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు రఘురామలాంటి వ్యక్తులు సహాయపడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. రఘును పార్టీ బాధ్యతల నుంచి తప్పించగానే దివాలాకోరు వ్యాఖ్యలతో జగన్‌పై బురదచల్లుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చూస్తుంటే ఆయన స్క్రిప్టు ఎక్కడిదో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. జగన్ పనితీరు, నాయకులను కలుపుకునే విధానం పార్టీ పెట్టినప్పటి నుంచి తమకు, నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసునన్నారు. పార్టీలో చేరి 90 రోజులు కూడా లేని రఘులాంటి వ్యక్తి జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఏ ఒక్క కార్యకర్తా సహించరని హెచ్చరించారు. ఏ పార్టీలో చేరినా ఆయనకు నర్సాపురం ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని శేషుబాబు, సర్రాజు హెచ్చరించారు. ప్రసాదరాజు ఏమన్నారంటే... కాంగ్రెస్, టీడీపీలకు కోవర్టులా పనిచేస్తున్న రఘును లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించాలన్న జిల్లా నేతల విజ్ఞప్తి మేరకే పార్టీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకులను పక్కన పెట్టాలని జగన్‌పై రఘు తీవ్ర ఒత్తిడి చేశారు. కానీ మా నాయకుడు మాలాంటి వారి పక్షాన నిలిచినందుకు సహించలేక ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటివరకు జగన్ ఇంద్రుడు, చంద్రుడని రఘు చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణం కిరణ్, చంద్రబాబులే అని మాట్లాడారు. ఒక్క రోజులోనే మార్పు వచ్చిందా? పార్టీ నుంచి బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సూటిగా చెప్పగలరా? జగన్ విభజనవాదంటూ వితండవాదం చేస్తున్న ఆయనకు, తాను చేరబోయే బీజేపీ, టీడీపీలు సమైక్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? రఘు నన్ను కలవలేదు: వెంకయ్యనాయుడు రఘురామకృష్ణంరాజు గురువారం తనను కలసినట్టు వచ్చిన వార్తలను బీజేపీ నేత వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. రఘురామ తన ఇంటికి అల్పాహార విందుకు రాలేదని, వాస్తవానికి తాను హైదరాబాద్‌లోనే లేనని తెలిపారు. తాను విజయవాడ నుంచే బెంగుళూరు వెళ్లానని, ప్రస్తుతం అక్కడే ఉన్నానని పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజుకు స్వస్తి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వ్యాపార వేత్త రఘురామ కృష్ణంరాజును ఆ బాధ్యతల నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పించారు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారశైలి మీద ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సమన్వయకర్తల నుంచి అందిన ఫిర్యాదుల దృష్ట్యా... జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.