భవనం కూలి ఒకరి మృతి
చౌటుప్పల్, న్యూస్‌లైన్ : చౌటుప్పల్‌లో శనివారం భవనం కూలి ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నా రాయణపురం మండలం కడపగండితండాకు చెందిన కరంటోతు శంకర్(20) చౌటుప్పల్‌లోని శరత్ హోటల్లో సప్లయిర్‌గా ఏడాది కాలంగా పనిచేస్తున్నాడు. హోటల్ పైఅంతస్తులోని గదిలో నివాసముంటున్నాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హోటల్ భవనంలో ముందు భాగాన్ని కొన్నిరోజుల క్రితం కూల్చివేశారు. దీని పక్క నుంచే కొత్త భవనాన్ని నిర్మించారు. దీనికి మెట్లు నిర్మించలేదు. కూల్చివేయగా, భవనానికి మిగిలిన మెట్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.
శుక్రవారం రాత్రి శంకర్ గదికి వెళ్లి పడుకున్నాడు. శనివారం ఉదయం 10గంటలకు పనిలోకి వచ్చేందుకు మెట్ల మీది నుంచి కిందికి దిగుతుండగా ఆకస్మాత్తుగా భవనం కూలిపోయింది. శంకర్ శిథిలాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పో లీసులు వచ్చి శిథిలాలను తొలగించి మృ తదేహాన్ని బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కె.జగన్నాథరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.