240 కేజీల గంజాయి పట్టివేత
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట శివారు ప్రాంతంలో శనివారం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నం జిల్లాలో 140 కేజీల గంజాయి స్వాధీనం
జి. మాడుగుల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 140 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి అరెస్ట్ చేసిన వ్యక్తులను కాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెడతామని పోలీసులు తెలిపారు.